ఇది ప్రజాగెలుపు రామసహాయం విజయంపై మంత్రి పొంగులేటి స్పందన …
చరిత్ర సృష్టించాలన్నా…. దాన్ని తిరగ రాయాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యం
- ఎవరూ ఊహించని మెజారిటీని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు
- మీ వాణిని ఆర్ఆర్ఆర్ ఢిల్లీలో వినిపిస్తారు
ఇది ప్రజాగెలుపు ఖమ్మం కాంగ్రెస్ కు కంచుకోటని మరోసారి నిరూపించిన ప్రజలకు ధన్యవాదాలు …ఈ విజయం మాకు మరింత భాద్యతను పెంచింది …ఉమ్మడి జిల్లా ప్రజలకు సేవచేయాలనే మా సంకల్పానికి మరింత ప్రోత్సాహం ఇచ్చిందని మంత్రి పొంగులేటి అన్నారు…రాజకీయాల్లో చరిత్ర సృష్టించాలన్నా…. దాన్ని తిరగ రాయాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజక అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం లోక్ సభ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వని మెజారిటీని ఆర్ఆర్ఆర్ కు అందించడం కాంగ్రెస్ పార్టీకి గర్వకారణం అన్నారు. ఈ విజయం దేశం యావత్తు గర్వించేలా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పై నమ్మకముంచి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని మరోమారు ప్రజలు నిరూపించారన్నారు. ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటామన్నారు. 4,62,011 లక్షల ఓట్ల మెజారిటీతో చరిత్ర సృష్టించడంలో భాగస్వాములు అయిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ నియోజక పరిధిలోని ప్రజలంతా ఏం కావాలని కోరుకుంటున్నారో…. వారి పక్షాన ఢిల్లీలో ఆర్ఆర్ఆర్ తన వాణిని వినిపిస్తారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని పేర్కొన్నారు. ఢిల్లీలోని సోనియమ్మ , రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ దిగ్గజాలు హర్షించేలా ఖమ్మంలోని కాంగ్రెస్ శ్రేణులంతా సంబురాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అంతకు ముందు మంత్రి పొంగులేటి దంపతులు కురవి వీరభద్రస్వామిని దర్శించుకున్నారు ..వేదపండితులు ఆలయ సంప్రదాయాలతో వారికీ స్వగతం పలికారు ..
రామసహాయం రఘురాంరెడ్డికి కాంగ్రెస్ నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అభినందనలు ..
ఖమ్మం లోకసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఘనవిజయం సాధించిన రామసహాయం రఘురాంరెడ్డికి కాంగ్రెస్ నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు ..జిల్లా చరిత్రలో పెద్ద మెజార్టీ ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు …రఘురాంరెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు సేవలందించి అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు ..