జాతీయ రాజకీయ వార్తలు

కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నాం: ఖర్గే కీలక వ్యాఖ్యలు

  • ఖర్గే నివాసంలో కూటమి పార్టీల నేతల సమావేశం
  • ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయన్న ఖర్గే
  • మోదీ నైతికంగా ఓడిపోయారని వ్యాఖ్య

తమ ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఖర్గే నివాసంలో కూటమి పార్టీల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ… ఈ ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయన్నారు. నైతికంగా ప్రధాని ఓడిపోయారన్నారు. తమ కూటమిలోకి కొత్త పార్టీలు రావొచ్చునని ఆహ్వానించారు.

రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి ఐక్యంగా పోరాడిందన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాలనుకునే ఏ పార్టీ అయినా కూటమిలోకి రావొచ్చునన్నారు. ఈ ఫలితాలు తనకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ మోదీ ప్రజల అభీష్టాన్ని మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Related posts

ఇండియా కూటమికి తృణమూల్ కాంగ్రెస్ స్ట్రాంగ్ వార్నింగ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం మమతా బెనర్జి

Ram Narayana

నాలుగు రోజుల హైడ్రామాకు తెర.. కాంగ్రెస్ అభ్యర్థుల చివరి జాబితా విడుదల…

Ram Narayana

తమిళనాట కొత్తపొత్తులు …ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలు …

Ram Narayana