తెలుగు రాష్ట్రాలు

చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఫోన్… విభజన అంశాలపై కీలక వ్యాఖ్యలు

  • ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు అభినందనలు తెలిపిన రేవంత్ రెడ్డి
  • రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్ష
  • విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి
  • చర్చించుకొని… సామరస్యంగా పరిష్కరించుకుందామని సూచన

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అదే సమయంలో రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని టీడీపీ అధినేతను కోరారు. విభజన హామీలు, ఆస్తుల పంపకాలపై పూర్తిగా చర్చించుకొని… సామరస్యంగా పరిష్కరించుకుందామని సూచించారు.

Related posts

హైదరాబాద్‌లో భారీ పేలుడు కుట్ర భగ్నం.. ఇద్దరు ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్!

Ram Narayana

అమ్మకు వందనం….

Ram Narayana

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి ఇక రెండున్నర గంటలే.. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే రూట్ ఖరారు

Ram Narayana