Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

నల్లగొండ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో గందరగోళం …బీఆర్ యస్ నిరసన

నల్లగొండలో జరుగుతున్న ఖమ్మం ,వరంగల్ , నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో లెక్కింపు ఏకపక్షంగా జరుగుతుందని బీఆర్ యస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపించారు …లెక్కింపు విషయంలోనూ బండిల్స్ వేరు చేయడంలో తమ ఏజెంట్లు అడిగితె పట్టించుకోకుండా వ్యవహరించడం ఎలాంటి ప్రజాస్వామ్యమో చెప్పాలని డిమాండ్ చేశారు ..రిటర్నింగ్ అధికారి కనీసం అభ్యర్థి ఫిర్యాదులు కూడా పట్టించుకోకుండా ఉన్నారని ,లీడింగులు కూడా తమ ఇష్టం వచ్చినట్లు మా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా చేస్తున్నారని ఆరోపించారు …దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యదు చేస్తున్నామని తెలిపారు .

తాము ఎన్నికల సంఘాన్ని గౌరవిస్తాం …దురదృష్టం ఏంటంటే ఎన్నికల అధికారులు అవకతవకలకు పాల్పడటం పైగా అడిగితె బుకావించడం , అభ్యర్థినని పట్టించుకోక పోవడం .. ఏకపక్షంగా లీడ్ ప్రకటించడంపై మాకు అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు ..3వ రౌండ్ లీడ్ అడుగుతే పోలీసులను పెట్టి గెంటివేశారు.. కౌటింగ్ విషయం హల్ 4 లో మాకు 530 మెజార్టీ ఉందని సమాచారం…3000 లీడ్ ఉందని మేము అంచనా వేస్తే డైరెక్ట్ 4000 లీడ్ అని ప్రకటించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘానికి అప్పీల్ చేస్తున్నాం….పారదర్శకంగా గా కౌంటింగ్ నిర్వహించాలని కోరుకుంటున్నాం…ఎన్నికల నిర్వహణలో చాలా తేడాలు ఉన్నవి…ఒకే హల్ లో ఏకంగా 1000 ఓట్ల తేడా వచ్చింది…నిన్నటి నుండి కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు కూడా తీసుకోలేదు.
అభ్యర్థిగా డేటా అడుగుతే ఇవ్వకుండా భయపడుతున్నారు…మేము గెలుస్తున్నామని మా గెలుపుని ఆపాలని కుట్రపురితంగా వ్యవహరిస్తున్నారు…పారదర్శకంగా ఎన్నికలు కౌంటింగ్ నిర్వహించండి గెలుపు ఓటములను స్వీకరిస్తామని అన్నారు …

బీఆర్ యస్ నేత మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ 3వ రౌండ్ లో 18,876 లీడ్ ఆర్వో ఏకపక్షంగా ప్రకటించి వెళ్లిపోవడం దారుణమని అన్నారు ..ప్రతి టేబుల్ పై 10 ఓట్ల మించి తేడాలు వస్తున్నవి మా అభ్యర్థి ప్రశ్నిస్తే పోలీసులను పెట్టి బయటికి వెళ్లగోడుతున్నారని ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు ..2 వ ప్రాధాన్యత లో రాకేష్ రెడ్డి గెలుస్తాడని నమ్మకం తమకు ఉందని అన్నారు . ఆవిషయం వారికీ అర్ధం అయి ఫలితం మార్చడం కోసం ఆర్వో ద్వారా కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు .. కౌంటింగ్ లో న్యాయ బద్దంగా వ్యవహారించాల్సీన ఆర్ ఓ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించడం తగదని ఇప్పటికైనా 3 వ రౌండ్లో వచ్చిన లీడ్ ని మరోసారి పరిశీలించాలన్నారు ..

Related posts

ఇంటర్ పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో దిద్దుకోలేని నిర్లక్ష్యం…విద్యార్థులకు శాపం …

Ram Narayana

ఈ నెల 12న పొంగలేటి ప్రకటన.: మల్లు రవి 

Drukpadam

గండం నుంచి గట్టెక్కిన తమ్మినేని… మొఖంలో చిరునవ్వు …

Ram Narayana

Leave a Comment