Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఈ నెల 24 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు..

లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఎప్పుడంటే..

  • జూన్‌ 24 నుంచి జులై 3 వరకూ సమావేశాలు
  • జూన్ 24, 25 తేదీల్లో కొత్త పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారం
  • జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం  
  • లోక్‌సభ స్పీకర్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న టీడీపీ, జేడీయూ

కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ 3.0 మంత్రివర్గం కూర్పు కూడా పూర్తైంది. మొత్తం 71 మంది ఎంపీల‌కు మంత్రులుగా అవ‌కాశం దక్కింది. వీరందరికీ శాఖలు కూడా కేటాయించడంతో మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం పార్లమెంట్‌ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక, కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

8 రోజులపాటు ఈ పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జూన్‌ 24 నుంచి జులై 3 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా జూన్‌ 26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. జూన్‌ 24, 25 తేదీల్లో కొత్త పార్లమెంట్‌ సభ్యులు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. కాగా, లోక్‌సభ స్పీకర్ పదవిపై ఎన్‌డీఏ కూటమి పార్టీలు టీడీపీ, జేడీయూ రెండూ ఆశలు పెట్టుకున్నాయి. 26న లోక్‌సభ స్పీకర్ పదవిపై సస్పెన్స్ తొలిగిపోనుంది.

Related posts

ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయసేకరణ కోసం ప్రత్యేక కమిటీ నియామకం

Ram Narayana

ప్రియాంక గాంధీ కూతురుపై పోస్టు.. కేసు నమోదు చేసిన పోలీసులు…

Ram Narayana

కర్ణాటకలో సీఎం ఎంపికలో ఆలస్యం… పెరుగుతున్న ఆశావహుల సంఖ్య…

Drukpadam

Leave a Comment