Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మం జిల్లా కేంద్రసహకార బ్యాంకులో వర్గపోరు …రెండుగా చీలిన అధికార పార్టీ డైరక్టర్లు

ఖమ్మం జిల్లా కేంద్రసహకార బ్యాంకులో వర్గపోరు ఎటు దారితీస్తుందో అర్ధంకాక అయోమయంలో పడింది …అంతకు ముందు బీఆర్ యస్ చేతులో ఉన్న పాలకవర్గం రాష్ట్రంలో ఆపార్టీ ఓడిపోయిన తర్వాత జరిగిన పరిణామాల్లో బ్యాంకు చైర్మన్ గా ఉన్న కూరాకుల నాగభూషణం తన ప్రాధమిక సహకారసంఘంలో అవిశ్వాసంతో పదవి కోల్పోయారు ..నాటినుంచి వైస్ చైర్మన్ గా ఉన్న దొండపాటి వెంకటేశ్వరరావు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు ..అయితే ఆయన కూడా బీఆర్ యస్ నుంచి కాంగ్రెస్ కు జై కొట్టారు ..అయినప్పటికీ చైర్మన్ లేకపోవడంతో ఎన్నికజరగాలని మెజార్టీ డైరెక్టర్లు పట్టు పడుతున్నారు …గత రెండు మూడు సమావేశాల్లో ఇదే విషయం ఎజెండా చేర్చాలని కోరినప్పటికీ చైర్మన్ చేర్చటంలేదని వారు ఆరోపిస్తున్నారు ..ఇప్పుడు అంతా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ చైర్మన్ కుర్చీ కోసం అధికార పార్టీ డైరెక్టర్లు రెండుగా చీలి పోయారు …10 మంది డైరెక్టర్లు చైర్మన్ కు వ్యతిరేకంగా ఉన్నారు ..ఇది గమనించిన చైర్మన్ ఎజెండాలో చైర్మన్ ఎన్నిక ఇతర డైరెక్టర్ల ఎన్నిక జరపకుండా వాయిదా వేయడంపై భగ్గుమంటున్నారు …సమావేశం ప్రారంభం కాగానే 10 డైరెక్టర్లు చైర్మన్ ను నిలదీశారు … గురువారం జరిగిన సమావేశం రసాభాసగా మారింది …చేసేది లేక సమావేశం చర్చ జరగకుండానే వాయిదా పడింది …

ఎజెండా లో తాము గతంలో కోరిన అంశాలను పొందుపరసనందున, తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోనందున ఎజెండాలోని ఇతర అంశాలను తిరస్కరిస్తున్నట్లు 10 డైరెక్టర్లు ప్రకటించారు . డిసిసిబి లోని మెజారిటీ డైరెక్టర్లు పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు వీలుగా తీర్మానం చేసే అంశాన్ని ఎజెండాలో చేర్చాలని గత రెండు సమావేశాల నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన సమావేశం సందర్భంలో కూడా ప్రధానంగా ఇదే అంశంపై విభేదించిన డైరెక్టర్లంతా సమావేశానికి హాజరు కాకుండా బహిష్కరించారు. ఈసారి జరిగే సమావేశంలోనైనా ఎజెండా అంశాల్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు వీలుగా తీర్మానం చేసే అంశం ఉండాలని, అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఉద్యోగులు ,సిబ్బంది బదిలీలపై సమీక్షించాలని, ఖాళీగా ఉన్న నాలుగు డైరెక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేసే అంశాలను ఎజెండా లో అంశాలుగా పొందుపరచాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే . అదేవిధంగా పాలకవర్గం సభ్యులకు చెప్పకుండా 78 లక్షలు ఇంక్రిమెంట్లు ఇవ్వడంపై కూడా సమావేశంలో చర్చ జరిగేందుకు ఏజెండాలో ఆ అంశం పెట్టాలని డిమాండ్ చేశారు.
కాగా ఎజెండాలో ఆయా డైరెక్టర్లు చెప్పిన అంశాలు చేర్చకపోవడంతో సదరు డైరెక్టర్లంతా సమావేశానికి హాజరైనప్పటికీ, ఎజెండాలోని ఇతర అంశాలను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంటూ వెళ్లిపోయారు. మళ్లీ వచ్చే సమావేశంలోనైనా ఎజెండాలో తమ డిమాండ్లను పొందుపరిస్తేనే, తాము సమావేశానికి హాజరవుతామని డైరెక్టర్లు ప్రకటించారు..

ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులంతా వ్యవసాయం పనుల్లో మునిగి తేలుతున్న సందర్భంలో సహకార బ్యాంకుల సహకారం రైతులకు ఎంతో అవసరం. ఇటువంటి తరుణంలో డిసిసిబి కీలక సమావేశాలు జరగకుండా వరుసగా వాయిదాలు పడడం రైతులపై ప్రభావం చూపుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే పద్ధతిలో మరో సమావేశం కొనసాగితే నాబార్డుకు సమర్పించాల్సిన ఆడిట్ రిపోర్టు సకాలంలో పంపకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి అని చర్చ కూడా డిసిసిబి వర్గాల్లో జరుగుతోంది.
సమావేశం ఎజెండా అంశాలను తిరస్కరించి బహిష్కరించిన డైరెక్టర్లలో , తుళ్లూరి బ్రహ్మయ్య, బొర్ర రాజశేఖర్, లక్కినేని సుధీర్, ఐలూరి వెంకటేశ్వర రెడ్డి, బోనాల లక్ష్మణరావు , కోటేశ్వరరావు, మేకల మల్లిబాబు యాదవ్, నూకల సైదులు, చావా వేణుగోపాలకృష్ణ, మోదుగు పుల్లారావు తదితరులు ఉన్నారు.

Related posts

పాలేరులో లంచం మాట వినకూడదు …అధికారులు పద్ధతులు మార్చుకోవాలి: మంత్రి పొంగులేటి

Ram Narayana

24న ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల చారిత్రిక మీట్

Ram Narayana

ఇందిరమ్మ ఇండ్లకు నిరుపేదలను ఎంపిక చేయాలి……మంత్రి పొంగులేటి

Ram Narayana

Leave a Comment