Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

సామినేని రామారావు హత్యకు భట్టినే భాద్యత వహించాలి…సిపిఎం

మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావు హత్యకు నియోజకవర్గ శాసనసభ్యులు , డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్న మల్లు భట్టి విక్రమార్క భాద్యత వహించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు …రామారావు అంత్యక్రియలు పాతర్లపాడు గ్రామంలో జరిగిన సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మందిని ఉద్దేశించి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రామారావు మచ్చలేని నాయకుడు, ఆయన ఉంటె తమ పెత్తనం సాగదని గ్రహించిన దుండగులు అత్యంత పథకం ప్రకారం హత్య చేయడం హేయమైన చర్య ..నాయకులను హత్య చేసినంత మాత్రాన ఎర్రజెండా లేకుండా పోతుందని అనుకోవడం మూర్ఖత్వం …చిన్న చిన్న ఒడిదొడుకులు ఎదురైనా మరింత ముందుకు పోతుంది .ప్రపంచంలో ఎర్రజెండా కావాలని కోరుతున్నవారి సంఖ్య పెరుగుతుంది ..ఎర్రజెండాను లేకుండా చేయాలనుకొనే వారు కాలగర్భంలో కలిశారు . రామారావు పార్టీకి చేసిన సేవలు మరువలేనివి …నాకు అత్యంత ఇష్టుడు …నన్ను చాల ప్రేమించేవాడు …మా ఇంట్లో కుటుంబసభ్యుడిగా ఉండే వారు .అలాంటి గొప్ప వ్యక్తి లేకపోవడం తీరని లోటు …వారి కుటుంబ సభ్యుల భాదను అర్ధం చేసుకోగలం …వారికీ అండగా ఉంటాం ..అంటూ జోహార్లు అర్పించారు ..

సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి .శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఈ హత్య పథకం ప్రకారం చేసిందే ..దీనికి సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలి …హంతకులను సమాజం నుంచి వెలివేయాలి. …రామారావు ఎలాంటి వాడే నాకు 25 ,30 సంవత్సరాలుగా తెలుసు …ఈ గ్రామంలో ఆయనకు ఉన్న పేరు ప్రఖ్యాతలు ఈ గ్రామంలో వారంరోజులు ఉండి చూశాను …అంటూ నివాళులర్పించారు ..

సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ ఇది దారుణ హత్య ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చుబెడుతున్న దుండగులను కఠినంగా శిక్షించాలి …వెంటనే పోలీసులు వారిని అరెస్ట్ చేయాలి ..తమకు చేతకాదనంటే చెప్పండి …మా కార్యకర్తలే వారిని ఎక్కడ దాక్కున్నా పట్టుకొని ప్రజల ముందు నిలబడతారని అన్నారు …రామారావు చేతులో కత్తి ఉంటె ఎంతమంది కైనా సమాధానం చెప్పగలిగే ధైర్యశాలి అని అన్నారు ..దొంగచాటుగా వచ్చి పథకం ప్రకారం హత్య చేసిన వారు పిరికిపందల వారిని ప్రజలు శాస్వితంగా సమాజం నుంచి బహిష్కరించాలన్నారు ..

కాంగ్రెస్ నాయకులూ పోట్ల నాగేశ్వరరావు , డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి రామారావు భార్య స్వరాజ్యం పోలీస్ కమిషనర్ తో తన భర్త హత్యకు భూతగాదా గొడవ అని చెప్పినట్లు మాట్లాడటం తగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు … ఆయనకు ఎక్కడ భూతగాదా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు .. ఆమె ఏమి చెప్పారో తెలియకుండా వాళ్ళు చెప్పదలుచుకున్నది ఆమె చెప్పినట్లు చెప్పడం దుర్మార్గమన్నారు …ఆమె సీపీ కి చెప్పేటప్పడు తాము కూడా అక్కడే ఉన్నామని ఆమె స్పష్టంగా కాంగ్రెస్ వాళ్లే ఈ హత్య చేశారని బతుకమ్మ పండుగ రోజే తన భర్తను హత్య చేస్తామని హెచ్చరించారని , రాజకీయంగా తమను ఎదుర్కోలేకనే ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పారని అన్నారు ..

గొప్పనాయకుడు రామారావు …కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గమైన కుట్ర …డిప్యూటీ సీఎం ఉన్నాడని హత్య చేసిన దుండగులు భావిస్తే తగిన శాస్తి తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు హెచ్చరించారు …అధికారం ఉందికదా అని వీర్రవీగితే అది శాశ్వితం కాదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు . బోనకల్లు మండలంలో జరిగిన హత్యలో పాల్గొన్నవారే రామారావు హత్యలో పాల్గొన్నారని .ఆరోజు ఆ దుండగులను అరెస్ట్ చేసి ఉన్నట్లయితే ఈ హత్య జరిగిదే కాదని అన్నారు ..

తమ ప్రియతమ నాయకుడి,మంచి మనిషి ,నిస్వార్థ ప్రజాసేవకుడు సామినేని రామారావు దారుణ హత్యను పాతర్లపాడు గ్రామ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు …తమ గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేసి తమ కష్టసుఖాల్లో పాలుపంచుకున్న నాయకున్ని కిరాతకంగా హత్య చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు …ఇది పిరికిపందల చర్య చంపినవారు ఇంతకింతకు అనుభవించక తప్పదని శాపనార్దాలు పెడుతున్నారు …

రామారావు ఆశయాలు సాధిస్తాం …జోహార్ రామారావు ..అమర్ రహే రామారావు ..కాంగ్రెస్ గూండాల్లారా ఖబర్దార్ ,ఖబర్దార్ అంటూ ఆయన అంతిమ యాత్ర సాగింది …ప్రజలు కన్నీటి పర్వవంతమైయ్యారు…అశ్రునయనాల మధ్య రామారావు కుమారుడు విజయ్ కుమార్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు ..ప్రజల రోదనలు దిక్కులు పిక్కటిల్లాయి..ఇంతటి ప్రజాభిమానం చూరగొన్న నాయకుడిని హత్య చేయడంపై అన్ని పార్టీలు తీవ్రంగా ఖండించాయి… దోషులను పట్టుకొని చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశాయి..

భట్టి విక్రమార్క మాట్లాడుతూ హింసాత్మక రాజకీయాలకు చోటు లేదు. దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తాం”అని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో ఎటువంటి నిర్లక్ష్యాన్నీ సహించబోమని స్పష్టం చేశారు.

డిప్యూటీ సీఎం క్లూస్ టీమ్, స్నిఫర్ డాగ్స్, సైబర్ టీమ్‌ల సహాయంతో ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. సామినేని రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, “వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం, ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకుంటుంది” అని భరోసా ఇచ్చారు.

Related posts

ప్రభుత్వం వైద్య ఉద్యోగులకు అన్యాయం చేయవద్దు…ఖమ్మం జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు అఫ్జల్ హాసన్!

Ram Narayana

ఖమ్మం సారధి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి తుమ్మల ..

Ram Narayana

టికెట్ కొని పల్లెవెలుగు బస్సు లో డిప్యూటీ సీఎం భట్టి ప్రయాణం …

Ram Narayana

Leave a Comment