రామారావును హత్య సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు ..
భూతగాదానా…? గ్రామం మీద పెత్తనం కోసం జరిగిందా ..??
రామారావు భార్య స్వరాజ్యం పోలీస్ కమిషనర్ కు ఏమి చెప్పారు ..
ఇంతకీ హంతకులు ఎవరు.. ఎక్కడ ఉన్నారు ?..వారికీ అండదండలు ఇస్తున్నది ఎవరు ..??
సామినేని రామారావును హత్య చేసిన వాళ్ళు ఎవరు …? వారి ఆచూకీ ఏమిటి …? ఆయనకు శత్రువులు ఎవరు ..? కాంగ్రెస్ వాళ్ళు చంపారా …? భూతగాదానా వల్ల హత్య జరిగిందా ..?అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది ..ఒకవేళ వ్యక్తిగత తగాదా ఉందా..? ఉంటె భూమి విషయంలో నిజంగా సమస్య ఉందా ..? దానికి హత్య చేసే అంతటి బలమైన కారణం కనిపిస్తుందా …? గతంలో వారు దీనిపై ఘర్షణలు పడ్డారా …? అనేది చూడాలి … కాంగ్రెస్ వాళ్ళే చేశారని సిపిఎం బలంగా ఆరోపిస్తుంది …లేదు గ్రామంలో భూతగాదా వల్ల జరిగిందని కాంగ్రెస్ చెపుతుంది … హత్య గావింపబడ్డ వ్యక్తి చిన్న చితక కాదు పేరున్నప్రజానాయకుడు … సిపిఎం ఉమ్మడి రాష్ట్ర కమిటీ సభ్యుడు ,రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు …గ్రామానికి రెండు సార్లు సర్పంచ్ గా ఎన్నికైన వ్యక్తి …తర్వాత ఆయన భార్యను కూడా సర్పంచ్ గా గెలిపించారు ..సుమారు ఐదు దశాదబ్దాలుగా మచ్చలేని నాయకుడుగా పేరు తెచుకున్నవారు …ఊరుకు ,ప్రజలకు మంచి చేయడమే తప్ప చెడు చేయడం ఎరగడు…మృదు స్వభావిగా పేరున్నవాడు …పైగా 73 సంవత్సరాల వయస్సు ..ఆలాంటి వ్యక్తిని భూతగాదా ఉందని కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్లు అనుకున్నా వాళ్ళే హత్య చేసినట్లు కాంగ్రెస్ వారు చెప్పదలుచుకున్నారా ..? లేదు సిపిఎం ఆరోపిస్తున్నట్లు రాజకీయంగా ఆయన ఉంటె తమకు గ్రామంలో పెత్తనం దక్కదని అనుకున్నవాళ్ళు హత్య చేసి ఉంటారా…? అనేది పోలీసుల విచారణలో తేలాల్సిన అంశం…దోషులు ఎవరనేది ఇంకా బయటకు రాకపోయినా పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చి ఉంటారు …ఈ విషయంలో సీపీ కూడా చాల సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది . డిప్యూటీ సీఎం ఆదేశాలతో హత్య వార్త తెలిసిన వెంటనే స్వయంగా గ్రామానికి వెళ్లి విచారించారు ..దోషులను పట్టుకునేందుకు అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తామని కూడా రామారావు కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. ఆ మేరకు క్లూస్ టీం, డాగ్ స్క్యాడ్ ను రప్పించారు … అయితే ఎవరి వత్తిడిలకు పోలీసులు లోనుకాకుండా నిజమైన దోషులను పట్టుకోవాలని సిపిఎం పార్టీ ,వారి కుటుంబసభ్యులు కోరుకుంటున్నారు ..
సహజంగానే రామారావుకు శత్రువులు ఎవరు అంటే ..? స్థానిక కాంగ్రెస్ నాయకులేనని గ్రామస్తులు చెపుతున్నారు ..హత్య జరిగిన తర్వాత ఎవరి కదలికలు ఏమిటి అనేది పసిగట్టలేనంత అమాయకులు కాదు ప్రజలు. ఈ హత్య పైస్థాయిలో తెలిసి జరిగిందా లేదా అనేది పక్కన పెడితే , రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా ఉన్నతస్థాయిలో ఉన్న భట్టి విక్రమార్క పేరు పదే పదే ప్రస్తావనకు వస్తుంది . ఆయనకు తెలియకపోయినా , ఆయన తమకు అండగా ఉన్నాడనే ధైర్యంతో హంతకులు ఉన్నారని సిపిఎం ఆరోపిస్తుంది .. దీంతో భట్టికి చెడ్డపేరు వస్తుందని ఆయన ఆదేశాల మేరకు కాంగ్రెస్ వాళ్ళు రంగంలోకి దిగారు .. భట్టి అదేశాలతోనా లేదా వారి ఆలోచన ప్రకారమా ..? ప్రెస్ మీట్ పెట్టారు …అందులో ఎలాంటి తప్పులేదు …అయితే రామారావు భార్య స్వరాజ్యం పోలీస్ కమిషనర్ కు భూతగాదా గొడవ వల్లనే తన భర్త హత్య జరిగిందని చెప్పినట్లు కాంగ్రెస్ నాయకులూ మీడియా సమావేశంలో తెలిపారు …సీపీ, రామారావు భార్యను కలిసి మాట్లాడిన సందర్భంలో తాను అక్కడే ఉన్నానని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పోతినేని సుదర్శన్ చెప్పారు…ఆమె సీపీతో కాంగ్రెస్ గుండాలు తన భర్త ను హత్య చేశారని బతుకమ్మ పండగ రోజునే ఆడవాళ్ళం అందరం బతకమ్మ ఆడేందుకు వెళుతుండగా కాంగ్రెస్ వాళ్ళు నీ భర్తను చంపుతామని హెచ్చరికలు చేసినట్లు సీపీకి వివరించారని తెలిపారు … ఇందులో ఏది సత్యం ..ఏది అసత్యం అనేది సీపీనే చెప్పాలి …ఇంతకీ హంతకులు ఎక్కడ ఉన్నారు ?…వారికీ అండదండలు ఇస్తున్నది ఎవరు ..?? అనేది ఉత్కంఠగా మారింది …!

