- అయోధ్యలో నిర్మించిన రామాలయంపైనే బీజేపీ ఆశలు
- సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో కమలం పార్టీ అభ్యర్థి దారుణ ఓటమి
- హిందువులు అత్యధికంగా ఉన్న చోటే బీజేపీ ఓటమిపై దేశవ్యాప్తంగా చర్చ
ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని ఘంటాపథంగా చెప్పిన బీజేపీ చివరికి మెజార్టీ మార్కును కూడా దాటలేక చతికిలపడింది. అయోధ్యలో రామాలయం కట్టించాం కాబట్టి దేశవ్యాప్తంగా ఇక తమకు తిరుగులేదని భావించింది. ఈవీఎంలన్నీ బీజేపీ ఓట్లతో నిండిపోతాయని కలలు కంది.
దేశంలోని మిగతా రాష్ట్రాల సంగతేమో కానీ, రామాలయాన్ని నిర్మించిన అయోధ్యలోనే ఆ పార్టీకి దారుణ పరాభవం ఎదురైంది. అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి లల్లూసింగ్.. తన సమీప సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేశ్ ప్రసాద్ చేతిలో దారుణ ఓటమి చవిచూశారు.
శతాబ్దాల తరబడి గుడారంలో ఉన్న రాముడికి విముక్తి కల్పించామని, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆలయాన్ని నిర్మించామని ప్రచారం చేసుకున్న బీజేపీ చివరికి అక్కడే దారుణ పరాభవాన్ని ఎదుర్కొంది. మెజార్టీ హిందువులు ఉన్న అయోధ్య ప్రజలే హిందుత్వాన్ని నెత్తిన పెట్టుకున్న బీజేపీని ఎందుకు ఓడించారు? బీజేపీని అంతగా వ్యతిరేకించడానికి కారణాలు ఏంటి? అన్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.