Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

నితీశ్ కుమార్… మోదీ పాదాలను తాకి బీహార్‌ను అవమానించారు: ప్రశాంత్ కిశోర్

  • ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక అన్న ప్రశాంత్ కిశోర్
  • తాను నితీశ్ కుమార్‌తో కలిసి ఉన్నప్పుడు ఇలా లేరని వ్యాఖ్య
  • 2025 తర్వాత కూడా అధికారంలో ఉండేందుకు కాళ్లు మొక్కుతున్నారని విమర్శ

ఒక రాష్ట్ర నాయకుడు లేదా ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక అని… అలాంటి వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ పాదాలను తాకి బీహార్ అవమానపడేలా చేశారని ప్రముఖ రాజకీయ పండితుడు ప్రశాంత్ కిశోర్ అన్నారు. బీహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గతవారం ఎన్డీయే సమావేశంలో మోదీ పాదాలను నితీశ్ కుమార్ తాకడం సరికాదన్నారు.

గతంలో నితీశ్ కుమార్‌తో కలిసి పని చేసినప్పటికీ ఆయనను ఎందుకు విమర్శిస్తున్నారని కొంతమంది తనను ప్రశ్నిస్తున్నారని… కానీ ఆ రోజు ఈ ముఖ్యమంత్రి ఇప్పటి వలె లేరన్నారు. నాడు తన మనస్సాక్షిని అమ్మకానికి పెట్టలేదని విమర్శించారు. కానీ ఇప్పుడు బీహార్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు.

మోదీ మూడోసారి ప్రధాని కావడంలో నితీశ్ కుమార్ పాత్ర ఎంతో ఉందని చర్చలు సాగుతున్నాయన్నారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం తనకున్న బలాన్ని వినియోగించుకోవడం లేదని ఆరోపించారు. పైగా, 2025 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా బీజేపీ మద్దతుతో అధికారంలో కొనసాగేందుకు ప్రధాని మోదీ కాళ్లను మొక్కుతున్నారని మండిపడ్డారు.

Related posts

అధికారంలో ఉన్న పార్టీలే ప్రతిపక్షంలో ఉన్నాయి.. ప్రపంచంలో ఎక్కడా ఇలా లేదు: రాజ్ ఠాక్రే

Ram Narayana

కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ ఏర్పాటు.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికే చోటు…!

Ram Narayana

చంద్రబాబు ఇంటికి అమిత్ షా, జేపీ నడ్డా… మంత్రివర్గ కూర్పుపై చర్చ

Ram Narayana

Leave a Comment