- టీసీఎస్ తన వ్యాపార రహస్యాలు బహిర్గతం చేసిందంటూ డీఎక్స్ సీ ఆరోపణ
- అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు
- డీఎక్స్ సీ కంపెనీకి రూ.1600 కోట్లు చెల్లించాలని టీసీఎస్ కు కోర్టు ఆదేశాలు
- ఈ తీర్పును సవాల్ చేయాలని టీసీఎస్ యోచన
తమ వ్యాపార రహస్యాలను భారత ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ కంపెనీ బయటపెట్టిందని ఆరోపిస్తూ డీఎక్స్ సీ (గతంలో సీఎస్ సీ) కంపెనీ అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసులో టీసీఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. డీఎక్స్ సీ సంస్థకు రూ.1600 కోట్లు చెల్లించాలంటూ టీసీఎస్ ను అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో జూన్ 14న అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ భారీ జరిమానా విషయాన్ని టీసీఎస్ సంస్థ తన ఎక్స్చేంజి ఫైలింగ్ లో వెల్లడించింది. అమెరికా కోర్టు తీర్పు తమ ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి ప్రభావం చూపబోదని టీసీఎస్ ధీమా వ్యక్తం చేసింది.
కాగా, అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పును సవాల్ చేయాలని కూడా టీసీఎస్ నిర్ణయించకున్నట్టు తెలుస్తోంది.