- ఫ్లోరిడాలో వరల్డ్ కప్ మ్యాచ్
- వర్షం కారణంగా చిత్తడిగా మారిన మైదానం
- టాస్ వేయకుండానే మ్యాచ్ రద్దు
- టీమిండియా, కెనడా జట్లకు చెరో పాయింట్
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా, కెనడా మ్యాచ్ కనీసం టాస్ కూడా వేయకుండానే రద్దయింది. మ్యాచ్ కు వేదికైన ఫ్లోరిడాలో వర్షం కురవడంతో మైదానం చిత్తడిగా మారింది.
మ్యాచ్ సమయానికి వర్షం లేనప్పటికీ, మైదానాన్ని ఆటకు అనువుగా సిద్ధం చేసేందుకు గ్రౌండ్ స్టాఫ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, టీమిండియా, కెనడా జట్లకు చెరో పాయింట్ లభించింది.
గ్రూప్-ఏ నుంచి టీమిండియా, ఆతిథ్య అమెరికా జట్లు ఇప్పటికే సూపర్-8 దశకు చేరిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ లో జూన్ 19 నుంచి సూపర్-8 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. సూపర్-8 దశలో టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఆఫ్ఘనిస్థాన్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ జూన్ 20న బార్బడోస్ లో జరగనుంది.