- ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్న కేకే
- సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కేకే
- కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఖర్గే
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యుడు, తెలంగాణకు చెందిన కీలక నేత కె.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఖర్గే… ఆయనకు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.