Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

భూమ్మీద మనుషులుండే మారుమూల దీవి ఇదే.. నాసా షేర్ చేసిన ఫొటో!

  • అట్లాంటిక్ మహా సముద్రం మధ్యలో ఉన్న దీవి
  • 300 మంది లోపే జనాభా.. అంతా బ్రిటన్ సంతతి వారే..
  • ఈ దీవికి దగ్గరిలోని కేప్‌ టౌన్‌ కు దూరమే ఏకంగా 2,787 కిలోమీటర్లు.

కొందరు ఎక్కడో ఏ అడవిలోనో, ఎడారిలోనో చిక్కుకుపోతుంటారు. చుట్టూ మనుషులు కనబడక ఆందోళన పడుతుంటారు. మరి ఎక్కడైనా సుదూరంగా ఒకేచోట ఉండిపోయి.. మరో ఊరికి వెళ్లేందుకు వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఓ ప్రాంతమే ‘ట్రిస్టాన్ డ కున్హా’. ప్రపంచంలో మనుషులు నివసించే ప్రాంతాల్లో అత్యంత దూరంగా ఉన్న దీవి ఇదే. 

అట్లాంటిక్ మహా సముద్రంలో..tristan da cunhaఅట్లాంటిక్ మహా సముద్రంలోని ట్రిస్టాన్ దీవి (కుడి వైపు పైన ఉన్నది) – నాసా చిత్రం 
అటు దక్షిణ అమెరికా ఖండానికి, ఇటు ఆఫ్రికా ఖండానికి దాదాపు మధ్యలో ఉండే దీవి ‘ట్రిస్టాన్ డ కున్హా’. ఇది బ్రిటన్ దేశం అధీనంలో ఉంది. ఇక్కడున్న ఒకే ఒక్క టౌన్ పేరు ‘ఎడిన్ బర్గ్ ఆఫ్ సెవెన్ సీస్’. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ల్యాండ్‌శాట్‌ ఉపగ్రహం ఇటీవల ఈ దీవిని ఫొటో తీసింది. నాసా తమ ‘నాసాఎర్త్’ పేరిట ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో ఈ ఫొటోను పోస్ట్‌ చేసింది. 

మంచు, పచ్చదనం మధ్య..

  • 207 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ‘ట్రిస్టాన్ డ కున్హా’ దీవిలో చాలా భాగం పెద్ద పర్వతమే. దాని శిఖరం కూడా మంచుతో కప్పి ఉంటుంది. మిగతా దీవి అంతా దట్టమైన అడవులతో పచ్చదనం నిండి ఉంటుంది.
  • ఇక్కడ జనాభా 300 మంది కంటే తక్కువే. అంతా బ్రిటన్ సంతతి వారే నివసిస్తూ ఉంటారు. దీనికి దగ్గరగా కొన్ని దీవులున్నా.. అవేవీ మనుషులు నివసిస్తున్న ప్రాంతాలు కాదు.
  • మిగతా ప్రపంచంతో కలవాలంటే వేల కిలోమీటర్లు సముద్రంలో ప్రయాణం చేయాల్సిందే. 
  • ట్రిస్టాన్‌ దీవికి మనుషులు నివసించే దగ్గరి ప్రాంతం దక్షిణాఫ్రికాలోని కేప్‌ టౌన్‌ నగరం. దాని దూరం కూడా ఏకంగా 2,787 కిలోమీటర్లు. 
  • అందుకే ప్రపంచంలో మనుషులు నివాసం ఉన్న అత్యంత మారుమూల ప్రాంతంగా ట్రిస్టాన్‌ ను చెబుతారు.

Related posts

చోరీకి వచ్చి నిద్రపోయిన దొంగ.. మర్నాడు ఉదయం అరెస్టు…

Ram Narayana

ఏడాది చిన్నారి అపాయంలో పడ్డా పట్టించుకోని తండ్రి!

Ram Narayana

భారత బుడతడి నిజాయతీకి దుబాయ్ పోలీసుల ఫిదా!

Ram Narayana

Leave a Comment