టీఎన్జీవో అధ్యక్షుడు అఫ్జల్ హాసన్ ఆత్మహత్యాయత్నం…
స్లీపింగ్ పిల్స్ మింగిన టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హాసన్
భారీ మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం
ఖమ్మంలోని ఓప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న కుటుంబసభ్యులు
నిలకడగా అఫ్జల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి
సంతకాల ఫోర్జరీ కేసులో అరెస్టయి ఇటీవలే బెయిల్ పై విడుదల
సంతకాల ఫోర్జరీ, నకిలీ ధృవీకరణ పత్రాల రూపొందించినట్లు అభియోగాలు, ఫిర్యాధులు
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హాసన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు …గత ఎన్నికల్లో బీఆర్ యస్ కు మరి ముఖ్యంగా జిల్లా మంత్రి అజయ్ కుమార్ కు గట్టి మద్దతు ఇచ్చిన ఆఫ్జల్ హాసన్ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ కు దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు ..టీఎన్జీవో ఖమ్మం జిల్లా యూనియన్ లో గతంలో ఆయనకు ఉన్న పట్టు సడలింది … జిల్లా యూనియన్ లో జరుగుతున్న పరిణామాల పట్ల కూడా ఆయన డిప్రెషన్ లో ఉన్నారు …దానికి తోడు ఇటీవల ఆయనపై సంతకాల ఫోర్జరీ కేసు నమోదు అయింది … అసలును పోలిన నకిలీ ధ్రువీకరణ పత్రాలు రూపొందించినట్లు ఆయనపై అభియోగాలు ఉన్నాయి… దీంతో అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు ..కొద్దిరోజుల క్రితం బెయిలు పై బయటకు వచ్చారు …తనకు జరిగిన అవమానం తట్టుకోలేక ఆయన నిద్రమాత్రలు మింగినట్లు తెలుస్తుంది …ఆయన్ను వెంటనే ఖమ్మంలోని ఒక ప్రవేట్ ఆసుపత్రికి తరలించించి చికిత్స అందిస్తున్నారు …భారీ మొత్తంలో నిద్రమాత్రలు మింగడంతో మరో రెండు మూడు రోజులు చికిత్స అవసరమని డాక్టర్లు పేర్కొంటున్నారు … ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ,స్నేహితులు ఆందోన వ్యక్తం చేస్తున్నారు …
కావాలనే కొందరు అఫ్జల్ హాసన్ ను వేధిస్తున్నారని , పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేశారని దీనిలో కాంగ్రెస్ పార్టీకి భాగం ఉందని బీఆర్ యస్ పార్టీ ఆరోపిస్తుంది …
పరామర్శకు బీఆర్ యస్ నేతలు …
ఆత్మహత్యాయత్నం చేసుకున్న అఫ్జల్ హసన్ ను పల్స్ హాస్పిటల్ లో పరామర్శించనున్న టిఆర్ఎస్ పార్టీ నేతలు ఖమ్మం జిల్లా బిఆర్ఎస్& ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి తదితరులు వస్తున్నట్లు సమాచారం …