చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించిన మంత్రి తుమ్మల
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు
హైద్రాబాద్ లో ఆయన నివాసంలో కలిసి అభినందించిన తుమ్మల
చంద్రబాబు అనుచరుడిగా తుమ్మల ..ఆయన మంత్రివర్గంలో చాలాకాలం మంత్రి
చంద్రబాబు అరెస్టు సైతం ఖండించిన తుమ్మల

తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైద్రాబాద్ నివాసంలో ఉన్న ఏపీ సీఎం నారా చందరబాబును కలిసి తిరిగి అధికారంలోకి వచ్చినందుకు అభినందనలు తెలిపారు. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికలలో టీడీపీ భారీ మెజార్టీ సాధించింది …అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మొదటిసారిగా హైద్రాబాద్ వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించారు …చంద్రబాబుకు ముఖ్య అనుచరుడిగా ,ఆయన మంత్రివర్గంలో కీలక శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించిన తుమ్మల చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి అభినందించి శాలువాతో సత్కరించారు …ఖమ్మంలో కూడా చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చిన రోజున టీడీపీ కార్యాలయానికి వెళ్లిన తుమ్మల పార్టీ వారిని అభినందించారు …జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్ట్ ను సైతం ఖండించారు …అయితే బాబు ను కలవడంలో రాజకీయ ప్రాధాన్యత ఏమైనా ఉందా అంటే ఇది కేవలం మర్యాదపూర్వక కలయిక మాత్రమేనని దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని మంత్రి తుమ్మల అన్నారు …సుదీర్ఘకాలం చంద్రబాబుతో కలిసి పనిచేసినందున కృతజ్ఞత పూర్వకంగానే కలిసినట్లు వెల్లడించారు …

…..
….రెండు రాష్ట్రాలకు మేలు చేకూర్చే జాతీయ రహదారులు జలవనరులు రైల్వే లైన్ ల పై చర్చ
….హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో మర్యాద పూర్వక భేటీలో పలు అంశాలపై చర్చలు.
…..పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్ కు అక్కడ నుంచి పులిచింతల నాగార్జున సాగర్ కు గోదావరి జలాలు తరలింపు భవిష్యత్ లో కీలకం
….పట్టిసీమ టూ పులిచింతల లింక్ తో శ్రీశైలం నీళ్ళు రాయలసీమ సాగు నీటి కష్టాలు తీరుతాయి…తెలంగాణ కు మేలు జరుగుతుంది.
….సత్తుపల్లి టూ కోవూరు రైల్వే లైన్….
పెనుబల్లి టూ కొండపల్లి రైల్వే లైన్ పనులు పూర్తయితే ఇరు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనకరమని తుమ్మల సూచన
….రైల్వే లైన్ తో బొగ్గు రవాణా పుణ్య క్షేత్రాలు సందర్చించే భక్తులకు ప్రయోజనకరం
….కొత్తగూడెం టూ పెనుబల్లి రైల్వే లైన్ పూర్తయింది… ఏపి లో రైల్వే పై దృష్టి పెట్టాలని తుమ్మల సూచన
….ఇరు రాష్ట్రాలు అన్నదమ్ముళ్లా విడిపోయినా అభివృద్ధిలో కలసి సాగాలని ఇరువురి మధ్య చర్చలు
….జల వివాదాలు లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో సాగేందుకు చంద్రబాబు అనుభవం ఎంతో దోహదం చేస్తుంది..
….భద్రాచలం ఐదు గ్రామాల విలీనం ఆవశ్యకత పై చంద్రబాబు కు వివరించిన మంత్రి తుమ్మల
…..తెలుగు రాష్ట్రాలు తల ఎత్తుకుని ఉండేలా అభివృద్ధి చెందాలని చంద్రబాబు తో ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల.
…..చంద్రబాబు నాయుడు తో ఎంతో ఆప్యాయత భేటీ సాగింది
తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పై చర్చించాం….తుమ్మల