Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఓ చిన్న కీటకం.. బైడెన్‌ పాత్రికేయ బృందం వెళుతున్న విమానాన్నే అడ్డుకుంది!

ఓ చిన్న కీటకం.. బైడెన్‌ పాత్రికేయ బృందం వెళుతున్న విమానాన్నే అడ్డుకుంది!
తొలి విదేశీ పర్యటనకు యూకేకు వెళ్లనున్న బైడెన్‌
ప్రోగ్రాం కవర్‌ చేయడానికి వెళ్లేందుకు సిద్ధమైన పాత్రికేయ బృందం
అడ్డుకున్న సికాడస్‌ కీటకాల దండు
మరో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన శ్వేతసౌధం

తొలి విదేశీ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వెళ్లనున్నారు. ఆయన కార్యక్రమాల్ని కవర్‌ చేయడానికి వెళ్లే పాత్రికేయుల బృందంతో వాషింగ్టన్‌లో ఓ విమానం సిద్ధమైంది. కానీ, అంతలోనే ‘సికాడస్‌’ అనే కీటకాల దండు విమానాన్ని చుట్టుముట్టింది. ఇంజిన్లు సహా ఇతర భాగాల్లో దూరి సాంకేతిక లోపానికి కారణమయ్యాయి. దీంతో చేసిది లేక విమానాన్ని రద్దు చేశారు. స్పందించిన శ్వేతసౌధం మరో ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది.

దాదాపు 17 ఏళ్ల పాటు భూమిలోనే ఉండే ఈ సికాడస్‌లు పునరుత్పత్తి సమయం వచ్చినప్పుడు పైకి ఎగురుతాయి. కేవలం కొన్ని వారాల పాటు మాత్రమే భూమిపై ఉండే ఈ కీటకాలు మనుషులు, పెంపుడు జంతువులకు తీవ్ర చికాకు కలిగిస్తాయి. వీటి వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఈ సికాడస్‌లను తెలుగులో ఈలపురుగు లేదా ఝిల్లిక అని వ్యవహరిస్తుంటారు.

Related posts

రైతులు నిరాశకు గురయ్యారన్న మాటే వినిపించకూడదు:సీఎం జగన్!

Drukpadam

మోడీకి భయపడుతున్న జగన్ ,చంద్రబాబు …ఉండవల్లి విసుర్లు ….

Ram Narayana

హైద్రాబాద్,రంగారెడ్డి,మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ యస్ స్వల్ప ఆధిక్యం

Drukpadam

Leave a Comment