Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

పంట రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం… వీరికి వర్తించదు!

  • ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వెల్లడి
  • 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13వ వరకు తీసుకున్న రుణాలపై మాఫీ
  • రైతు కుటుంబం గుర్తింపుకు రేషన్ కార్డు ప్రామాణికమని వెల్లడి

తెలంగాణ ప్రభుత్వం పంట రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వెల్లడించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13వ తేదీ వరకు తీసుకున్న పంట రుణాలపై ఇది వర్తిస్తుందని వెల్లడించింది. రైతు కుటుంబం గుర్తింపుకు రేషన్ కార్డు ప్రామాణికమని వెల్లడించింది.

పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణఖాతాల్లోనే జమ కానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును విడుదల చేస్తారు. ఎస్‌హెచ్‌జీ, జేఎల్జీ, ఆర్ఎంజీ, ఎల్ఈసీఎస్ రుణాలకు, రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదు. రుణమాఫీపై రైతుల సందేహాలను తీర్చడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. రైతు సమస్యలు ఉంటే 30 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాలకు వెబ్ పోర్టల్ చూడవచ్చు… లేదా మండల సహాయ కేంద్రాలను సంప్రదించాలి.

అంతకుముందు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… అగస్ట్‌లోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రైతుబంధు లేదా రైతు భరోసాకు సంబంధించి ఏడు వేల కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.

Related posts

తెలంగాణ‌లో 65 ఏళ్లు నిండిన అంగ‌న్‌వాడీ సిబ్బందికి విశ్రాంతి…

Ram Narayana

డిప్యూటీ సీఎం భట్టి నివసిస్తున్న ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు …

Ram Narayana

బీజేపీలో కీలక పరిణామాలు.. బండి సంజయ్ అసంతృప్తి

Drukpadam

Leave a Comment