Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీటీడీ జేఈవోగా వెంకయ్య చౌదరి నియామకం

  • వెంకయ్య చౌదరి 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి
  • వెంకయ్య చౌదరిని డిప్యుటేషన్ పై పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వం
  • ఆమోదం తెలిపిన కేంద్రం
  • మూడేళ్ల పాటు ఏపీలో డిప్యుటేషన్ పై పనిచేయనున్న వెంకయ్య చౌదరి

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. ఆయన 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. వెంకయ్య చౌదరిని డిప్యుటేషన్ పై పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఆయన డిప్యుటేషన్ పై ఏపీలో మూడేళ్ల పాటు పనిచేయనున్నారు. ఆయన గతంలో ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్, ఎండీగా పనిచేశారు.

అటు, 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఆకె రవికృష్ణను కూడా కేంద్రం ఏపీకి పంపించింది. రవికృష్ణ ప్రస్తుతం కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నారు. ఆకె రవికృష్ణ గతంలో కర్నూలు జిల్లా ఎస్పీగా వ్యవహరించారు.

యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి ఏవీ రాజమౌళిని కూడా కేంద్రం ఏపీకి డిప్యుటేషన్ పై పంపింది. రాజమౌళి 2014-19లో ఏపీ సీఎంవోలో పనిచేశారు. తాజాగా, ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఆయనను రాష్ట్రానికి పంపేందుకు ఆమోదం తెలిపింది. రాజమౌళి ప్రస్తుతం యూపీ హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు.

Related posts

మెక్సికోలో విద్యార్థులపై దుండగుడి కాల్పులు.. ఐదుగురు టీనేజర్లు, ఓ వృద్ధురాలి మృతి!

Drukpadam

ఎపిలో బస్సుకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

Drukpadam

మా మధ్య చిచ్చు పెట్టొద్దు.. ఢిల్లీ పెద్దలను ఎవరైనా కలవొచ్చు: బండి సంజయ్

Drukpadam

Leave a Comment