Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్… 12 మంది మావోయిస్టుల హతం

  • మహారాష్ట్ర-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో కాల్పుల మోత
  • వందోలి గ్రామం వద్ద నక్సల్స్ ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాల కూంబింగ్
  • ఆరు గంటలకు పైగా ఇరు పక్షాల మధ్య భీకర కాల్పులు
  • మృతుల్లో ఇద్దరు తెలుగు వాళ్లు!

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని వందోలి అటవీప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల ఘటనలో 12 మంది నక్సల్స్ మృతి చెందారు. 

ఈ ఎన్ కౌంటర్  లో పాల్గొన్న పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ సతీశ్ పాటిల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలం నుంచి అనేక ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎన్ కౌంటర్ లో హతులైన మావోయిస్టుల్లో ఇద్దరు తెలుగు వాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. 

ఈ మధ్యాహ్నం 7 సీ60 కమాండో దళాలు వందోలి గ్రామం వద్ద నక్సల్స్ సమావేశం అయ్యారన్న సమాచారంతో కూంబింగ్ కు బయల్దేరాయి. ఈ సందర్భంగా సీ60 కమాండో బలగాలకు, మావోయిస్టులకు మధ్య దాదాపు ఆరు గంటలకు పైగా భీకర కాల్పులు జరిగాయి. కాగా, మృతి చెందిన వారిలో సీనియర్ డివిజనల్ కమిటీ మెంబర్ కూడా ఉన్నట్టు గుర్తించారు.

Related posts

అదానీ గ్రూప్ లో ఏదో జరుగుతోంది… ఆ డబ్బు ఎవరిదో తెలియాలి: రాహుల్ గాంధీ

Ram Narayana

మణిపూర్ హింస రాజ్య ప్రేరేపితమే…అనీరాజా….

Ram Narayana

గోవా పర్యటనకు వెళ్లిన కుటుంబంపై కత్తులతో దాడి!

Drukpadam

Leave a Comment