Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

1 ,2 ,3 ఏ క్షణంలోనైనా విశాఖ నుంచి పరిపాలన మంత్రి బొత్స…

1 ,2 ,3 ఏ క్షణంలోనైనా విశాఖ నుంచి పరిపాలన మంత్రి బొత్స…
-మూడురాజధానులపై మరో ఆలోచన లేదన్న మంత్రి
-దుష్టశక్తులు కోర్టులకు వెళ్లాయని వెల్లడి
-న్యాయప్రక్రియ కొనసాగుతోందని వివరణ
-బిల్లు తెచ్చినప్పుడే రాజధాని ప్రక్రియ ప్రారంభమైందని వివరణ
1 ,2 ,3 ఏ క్షణంలోనైనా విశాఖ నుంచి పరిపాలన మంత్రి బొత్స ప్రారంభం అవుతుందని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.ఇందులో మరో మాటకు తావులేదని అన్నారు. తాము బిల్లు తెచ్చినప్పుడే మూడు రాజధానుల విషయంలో తమ వైఖరి వెల్లడించమని కొందరు ఇంకా ఎదో జరుగుతుందనే భ్రమల్లో ఉన్నారని అన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా రాజధానులపై ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.
విశాఖ, అమరావతి, కర్నూలు రాజధానుల అంశంలో మరో ఆలోచనకు తావులేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొన్ని దుష్టశక్తులు కోర్టులకు వెళ్లి ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం దీనిపై న్యాయ ప్రక్రియ కొనసాగుతోందని, ఏ క్షణమైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం కావొచ్చని తమ ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లు తెచ్చినప్పుడు విశాఖ రాజధాని ప్రక్రియ షురూ అయిందని తెలిపారు. కరోనా నేపథ్యంలో, ఎక్కడ్నించైనా సమావేశాలు నిర్వహించుకోవచ్చన్న విషయం అందరికీ అర్థమైందని పేర్కొన్నారు.

ఇక సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపైనా బొత్స స్పందించారు. సీఎం జగన్ పర్యటనపై టీడీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. జగన్ కు కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ దొరికితే ఒకలా, దొరక్కపోతే ఒకలా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రమంత్రులను కలిస్తే టీడీపీ నేతలకు అభ్యంతరం ఏంటి? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకే జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారని బొత్స స్పష్టం చేశారు.

“జగన్ ఢిల్లీ వెళితే ఏదో ఒక విమర్శ చేయడం టీడీపీ పనిగా పెట్టుకున్నదని అదేపనిగా విమర్శలు చేయడంపై ఏమిటి అసహనం వ్యక్తంచేశారు. . రాష్ట్రానికి మేలు జరిగేలా మాట్లాడండి లేదా నోరుమూసుకుని ఉండండి … మాటిమాటికి విమర్శల వల్ల మీ ఇమేజ్ ప్రజల్లో డేమేజ్ అవుతున్న విషయాన్నీ తెలుసుకుంటే మంచిది . లేకపోతె మీ కర్మ … వీలైతే సీఎంకు సూచనలు, సలహాలు ఇవ్వండి” అంటూ హితవు పలికారు.

Related posts

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆత్మహత్య చేసుకుంటా…..జోగు రామన్న

Drukpadam

దేశాన్ని అమ్ముతున్న నరేంద్ర మోడీ నుండి భారతదేశాన్ని రక్షించాలి: పోతినేని!

Drukpadam

లాఖిమ్ పూర్ లో ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి వాహనం: వ‌రుణ్ గాంధీ!

Drukpadam

Leave a Comment