ప్రొద్దుటూరులో రైతు ఆత్మహత్యకు కారకులైనవారిపై చర్యలకు బీఆర్ యస్ డిమాండ్
జిల్లా కలెక్టర్ ముజమీల్ ఖాన్ కు వినతి
కలెక్టర్ కు కలిసినవారిలో ఎమ్మెల్సీ తాతా మధు , లింగాల , సండ్ర , కొండబాల , కూరాకుల
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పాముకాటు చికిత్స ఘటనపై విచారణ కోరిన నేతలు
సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ని కలిసి చింతకాని మండలం, పొద్దుటూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కాటుతో వైద్యం పొందేందుకు వెళ్లిన రైతు పట్ల నిర్లక్ష్యం వహించిన సంఘటనపై విచారణ జరిపించాలని, ఇటీవల దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారంపై కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణంలు ఉన్నారు …