Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రతి పక్ష నేత హోదా’పై ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్..

  • అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ
  • విపక్ష హోదా కూడా దక్కని వైనం
  • ప్రతిపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా పట్టించుకోలేదన్న జగన్
  • ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లే వచ్చాయి. దాంతో ఆ పార్టీకి విపక్ష హోదా లభించే అవకాశాలు లేవు. అయితే, తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ కోరుతుండగా… కూటమి ప్రభుత్వం నుంచి దీనిపై నిర్ణయం వెలువడలేదు.

ఈ నేపథ్యంలో, జగన్ నేడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా పట్టించుకోవడంలేదని జగన్ ఆరోపించారు.

Related posts

ప్రీమియం రైళ్లలో టీ, కాఫీలపై ఆన్ బోర్డ్ సర్వీస్ ఛార్జీ రద్దు!

Drukpadam

కెనడాలో దారుణం… గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో భారతీయ విద్యార్థి మృతి

Ram Narayana

భట్టి ఆరోపణలపై మంత్రి పువ్వాడ మండిపాటు

Drukpadam

Leave a Comment