- కేసీఆర్ నిన్న సభకు ఎందుకు రాలేదో చెప్పాలన్న భట్టివిక్రమార్క
- రాష్ట్ర బడ్జెట్‌పై స్పందించిన కేసీఆర్ కేంద్ర బడ్జెట్ మీద ఎందుకు మాట్లాడలేదని ప్రశ్న
- పక్క రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇచ్చిందని, కానీ మన రాష్ట్రం మాటేమిటని నిలదీత
తమకు సమయం ఇచ్చానని కేసీఆర్ అంటున్నారని… కానీ వారు మాకు సమయం ఇచ్చేదేమిటి? విశ్రాంతి తీసుకోమని ప్రజలే వారికి సమయం ఇచ్చారని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. బడ్జెట్ ప్రసంగంపై కేసీఆర్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
మీడియా పాయింట్ వద్ద భట్టివిక్రమార్క మాట్లాడుతూ… కేసీఆర్ నిన్న సభకు ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. ఇప్పుడు హడావుడిగా వచ్చి బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్నారని, అంతే హడావుడిగా కేంద్ర బడ్జెట్‌పై ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు. పక్క రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇచ్చిందని, కానీ మన రాష్ట్రం మాటేమిటన్నారు. రాష్ట్రానికి మేలు చేయడానికి తెచ్చిందే రాష్ట్ర విభజన చట్టం అన్నారు. మనకు నిధులు కేటాయించకుంటే కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు.
కేసీఆర్‌ను తప్పకుండా జైలుకు పంపిస్తాం
కేసీఆర్‌ను తప్పకుండా జైలుకు పంపిస్తామని కాంగ్రెస్ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై కేసీఆర్ విమర్శలు సరికాదన్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపించే బాధ్యతను తీసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా పాయింట్‌కు వచ్చిన నువ్వు కోర్టు బోనుకు కూడా వెళతావ్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు పెద్దపీట వేశామన్నారు.