Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఏపీలో వైసీపీకి షాక్ లమీద షాకులు ….ఒక్కక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు

  • ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
  • వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించినా మండలికి వస్తున్న జకియా ఖానమ్
  • ఇప్పటికే మంత్రి ఫరూఖ్ ను కలిసిన వైనం
  • నేడు కుటుంబ సభ్యులతో కలిసి నారా లోకేశ్ తో భేటీ

అధికారం కోల్పోయి ఆత్మరక్షణలో ఉన్న వైసీపీకి షాక్ లమీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి…టీడీపీ అధికర్మలోకి వచ్చిన తరవాత వైసీపీ కార్యాలయం బోసిపోయింది …గతంలో నేతలను కలిసేందుకు క్యూకట్టిన వారు అటు వైపు కూడా చూడటంలేదు …జగన్ సెంట్రిక్ గా విమర్శల దాడిని టీడీపీ జనసేన , బీజేపీ కొనసాగిస్తూనే ఉన్నాయి… రెండు రోజుల క్రితం ఢిల్లీలో ఏపీ లో శాంతి భద్రతలపై జగన్ ధర్నా చేపట్టగా దానికి ఇద్దరు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు …కొట్టడమే కాదు వారు ఇక్కడ జరుగుతున్న మండలి సమావేశాలకు హాజరైయ్యారు …మండలిలో తమకు బలం లేకపోవడంతో టీడీపీ వైసీపీ నుంచి ఎమ్మెల్సీలను తవైపు లాక్కునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి…అందులో భాగంగానే జకియా ఖానామ్ అనే ఎమ్మెల్సీ నారా లోకేష్ ను కలిశారు …ఇక ఆమె పసుపు ఖండవా కప్పుకోవడమే తరువాయి అని అంటున్నారు ..


ఏపీ రాజకీయాల్లో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. జకియా ఖానమ్ వైసీపీని వీడి టీడీపీలో చేరతారని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినా, ఆమె మాత్రం శాసనమండలికి హాజరవుతున్నారు. ఆమె ఇటీవలే మంత్రి ఫరూఖ్ ను కలవడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. తాజాగా, జకియా ఖానమ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. లోకేశ్ తో పలు అంశాలపై ఆమె చర్చించారు. 

Related posts

పురందేశ్వరితో కలిసి చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: వెల్లంపల్లి శ్రీనివాస్

Ram Narayana

అంబటి రాంబాబుపై కేసు నమోదు…

Ram Narayana

చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీయే నేతల సమావేశం…

Ram Narayana

Leave a Comment