Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది …చక్కదిద్దండి …రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో మంగళవారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన జాతీయ బడ్జెట్ పై చర్చలో పాల్గొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజల న్యాయమైన హక్కులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి మరోసారి తెచ్చారు…ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ బడ్జెట్ పై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడవ సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం పట్ల ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

తమ పార్టీ నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 14ఏండ్ల పాటు అహింసా మార్గంలో మహోద్యమాన్ని నడిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన విషయాన్నీ తన ప్రసంగంలో వద్దిరాజు గుర్తు చేశారు … రాష్ట్ర ఏర్పాటు జరిగిన 10ఏండ్ల అనతికాలంలోనే, చిరు ప్రాయంలోనే కేసీఆర్ అన్ని రంగాలలో రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దారని అన్నారు … తెలంగాణలో నెలకొన్న శాంతి భద్రతలు, ప్రశాంతత, ప్రభుత్వ కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రోత్సాహంతో దేశ విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు ఆకర్షితులై ఎన్నో పరిశ్రమలు నెలకొల్పారని పేర్కొన్నారు …

ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఏమి దక్కలేదని తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు … దీంతో,స్వయంపాలన కోల్పోయి తాము అనామకులుగా మారిపోయామని ఇది తెలంగాణ ప్రజలను వంచించడమేనని ధ్వజమెత్తారు … చంద్రబాబు నాయుడు చొరవతో ఆంధ్రప్రదేశ్ కు నిధుల వరద,తమ తెలంగాణకు బురద పారిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారని సభ దృష్టికి తెచ్చారు … రాష్ట్రం నుంచి 8మంది బీజేపీ ఏంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ఒరిగిందేమిటి అని ప్రశ్నించారు .. నిధులు తేవడంలో బీజేపీ ఎంపీలు విఫలమయ్యారనే భావన ప్రజలలో నెలకొందన్నారు … రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నిధులు సాధించలేకపోతే .. వారికి ఇవే మొదటి,చివరి గెలుపుగా మిగలనుందని హెచ్చరించారు … తెలంగాణ ప్రజల ఆరాటం,పోరాటం అంతా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమేనన్న విషయం గుర్తుంచుకొని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దకపోతే బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదని చురకలు వేశారు ..ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం పట్ల తమ బీఆర్ఎస్ కు,ప్రజలకు ఎటువంటి ఈర్ష్యా ద్వేషాలు లేవని తెలిపారు …అదే సందర్భంలో వాటితో సమానంగా నిధులు రాబట్టలేకపోయిన బీజేపీ, కాంగ్రెస్ ఏంపీలు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని వద్దిరాజు పేర్కొన్నారు … అదే రాష్ట్ర సాధన,ప్రజల అభ్యున్నతినే లక్ష్యంగా, ధ్యేయంగా,అభిమతంగా పుట్టిన పార్టీ నుంచి ఎంపీలు గెలిచి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు ..
తమ రాష్ట్ర ప్రజల న్యాయమైన డిమాండ్స్ పట్ల సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు …

రాష్ట్ర పునర్విభజన చట్టంలో హామీనిచ్చిన పాలమూరు -రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయించాలని కోరారు .. తెలంగాణలో IIM,నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID)నెలకొల్పాలన్నారు … కొత్తగా ఏర్పడిన 23జిల్లాలకు నవోదయ పాఠశాలలు మంజూరు చేయాలన్నారు … ITIR ప్రాజెక్టుకు ఆమోదం తెలిపి యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించాల్సి ఉందన్నారు … సూరత్ తరహా మెగా టెక్స్టైల్ పార్కు నెలకొల్పి చేనేత రంగాన్ని మరింత ప్రోత్సాహించి నేతన్నలను ఆదుకోవాలన్నారు ….
సమ్మక్క-సారలమ్మ గిరిజన యూనివర్సిటీకి మరిన్ని నిధులు కేటాయించాలి తమ నాయకులు కేసీఆర్ గతంలో పలుమార్లు కోరిన విధంగా రక్షణ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు …
దేశంలోని పేదలకు 3కోట్ల గృహాలను నిర్మించే పథకంలో మా తెలంగాణకు 25లక్షల ఇండ్లు కేటాయించాలని కోరారు … మామూనూరు విమానాశ్రయాన్ని ఆధునీకరించి పౌర విమానాలను ప్రారంభించాలని , అయోధ్య తర్వాత ప్రసిద్ధి చెందిన భద్రాచలం రాముల వారి ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్న కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు …అదే విధంగా ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ , బయ్యారం ఉక్కు గనుల కర్మాగారం ఏర్పాటు చేయాలనీ ఇవి అన్ని రాష్ట్ర విభజన సందర్భంగా మీరు ఇచ్చిన హామీలేనని గుర్తు చేశారు …

Related posts

రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ వివాదం.. మీకొచ్చిన ఇబ్బంది ఏమిటన్న ప్రియాంకా చతుర్వేది

Ram Narayana

పార్లమెంటులో బహిష్కరణకు గురైన తొలి ఎంపీ ఎవరో తెలుసా?

Ram Narayana

నాడు నరేంద్రమోదీని అరెస్ట్ చేస్తామన్న చంద్రబాబు నేడు జైల్లో ఉన్నారు: విజయసాయిరెడ్డి

Ram Narayana

Leave a Comment