Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

యూపీఎస్సీ కొత్త చైర్ పర్సన్ గా ప్రీతి సుడాన్ నియామకం…

  • ఇప్పటివరకు యూపీఎస్సీ చైర్మన్ గా ఉన్న మనోజ్ సోని
  • ఇటీవల వ్యక్తిగత కారణాలతో రాజీనామా
  • 2025 ఏప్రిల్ 29 వరకు యూపీఎస్సీ చైర్ పర్సన్ గా కొనసాగనున్న ప్రీతి సుడాన్
  • ప్రీతి సుడాన్ 1983 బ్యాచ్ ఆంధ్రా క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నూతన చైర్ పర్సన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రీతి సుడాన్ నియమితులయ్యారు. యూపీఎస్సీ చైర్ పర్సన్ గా ఆమె రేపు (ఆగస్టు 1) బాధ్యతలు చేపట్టనున్నారు. 

ఇప్పటివరకు యూపీఎస్సీ చైర్మన్ గా వ్యవహరించిన మనోజ్ సోని ఇటీవల రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం 2029 వరకు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఆయన పదవి నుంచి వైదొలిగారు. మనోజ్ సోని స్థానంలో యూపీఎస్సీ పగ్గాలు చేపడుతున్న ప్రీతి సుడాన్ ఈ పదవిలో 2025 ఏప్రిల్ 29 వరకు కొనసాగుతారు. ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా ఉన్నారు. 

ప్రీతి సుడాన్ 1983 బ్యాచ్ ఆంధ్రా క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో ఆమె జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో సేవలు అందించారు.

Related posts

ఇమ్రాన్ ఖాన్ విడుదలకు పాక్ సుప్రీంకోర్టు ఆదేశాలు…

Drukpadam

లీకేజీలో కవిత పాత్ర ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణ….

Drukpadam

చత్తీస్ గఢ్ లోనూ లిక్కర్ స్కామ్… ఛేదించిన ఈడీ!

Drukpadam

Leave a Comment