Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌసులు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా రేపే ప్రారంభం ..

ఎప్పుడా…! ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సీతారామ ప్రాజెక్ట్ తొలిదశ నీరు విడుదల కార్యక్రమాన్ని రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు … గోదావరి జలాలను మన పంటభూములకు పారించుకోవాలనే ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసుల ఎన్నో దశాబ్దాల కోరిక నెరవేరుతున్న వేళ రైతులు హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు … మొదటి సారిగా తమ ప్రాంతంలోకి కెనాల్ ద్వారా నీరు రావడాన్ని చూసి ఆనందించేందుకు సిద్దపడుతున్నారు …గంగమ్మకు హారతులిచ్చేందుకు అత్రుతుగా ఎదురు చూస్తున్నారు .. ఇది ఒక పెద్ద పండగ వాతావరణాన్ని తీసుకుని రానున్నది …. ప్రజల సంబరాల మధ్య కాలవల్లో నీరు పరుగులు పెట్టనున్నాయి …

సీతారామ ప్రాజెక్ట్ ను 2016 మార్చ్ 31 న నాటి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు ..నాటి నుంచి నత్త నడకనే నడుస్తుంది …కాంగ్రెస్ వచ్చిన తర్వాత మంత్రులు ద్రుష్టి సారించారు .. పరుగులు పెట్టించారు … పూర్తీ కావడానికి మరో రెండు మూడు సంవత్సరాలు పడుతుందని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు …గురువారం రోజున సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం పుసుగూడం వద్ద నిర్మించిన రెండవ పంప్ హౌస్ నుంచి నీటిని కాలువలోకి విడుదల చేయనున్నారు …అదే సందర్భంలో మొదటి పంప్ హౌస్ ప్రాజెక్ట్ కు అతి సమీపంలోని బిజీ కొత్తూరు వద్ద ప్రారంభించనున్నారు …పూసుగుప్ప వద్ద మూడు పంప్ హౌస్ లకు పైలాన్ ఏర్పాటు చేశారు …మొదటి పంప్ హౌస్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మూడవ పంప్ హౌస్ ను జిల్లా ఇంచార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు ప్రారంభించనున్నారు .. ఉదయం హెలికాప్టర్ ద్వారా హైద్రాబాద్ నుంచి సీఎం అక్కడకు నేరుగా పూసుకుడెం చేరుకుంటారు …. అక్కడ నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు ..గంగామాతకు పూజలు చేస్తారు…మీడియా సమావేశంలో పాల్గొంటారు ..

గోదావరి నదిపై అశ్వాపురం మండలంలోని అమ్మగారి పల్లి వద్ద ఆనకట్ట నిర్మించడం ద్వారా గ్రావిటీ ద్వారా నీరు డ్రాచేసి 10 కి .మీ కాలవ ద్వారా అదే మండలం బిజీ కొత్తరు వద్ద మొదటి పంపు హౌస్ కు నీరు అందించనున్నారు …అక్కడ నుంచి 40 కి .మీ కెనాల్ ద్వారా ములకలపల్లి మండలం పుసుగూడం వద్ద 2 వ పంప్ హౌస్ కు మరో 10 కి .మీ తర్వాత కమలాపురం వద్ద 3 వ పంప్ హౌస్ నుంచి సత్తుపల్లి మండలంలోని యతలకుంట టన్నెల్ కు మరియు ఏన్కూర్ వద్ద ఎన్నెస్పీ కాల్వకు నీటిని తరలించే లాగా నిర్మాణం చేశారు …

ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ కు సుమారు 8 వేల 800 కోట్ల నిధులు ఖర్చు చేశారు …10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ఈ బృహత్ ప్రాజెక్ట్ వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా రూపు రేఖలు మారనున్నాయి… నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పరిధిలోని ఆయకట్టను కూడా ఈ ప్రాజెక్ట్ కు లింక్ చేస్తున్నారు …దీంతో ఒక వేళ ఎన్నెస్పీ లో నీటి లభ్యత లేనప్పుడు గోదావరి జలాలను ఉపయోగించుకునేలా ఈప్రాజెక్టు డిజైన్ చేశారు … దీంతో తెలంగాణ లోని నల్లగొండ , ఖమ్మం జిల్లాలకు ,వరంగల్ లోని మహబూబాబాద్ జిల్లాలకు ఇది ఎంతగానే ఉపయోగపడుతుంది …

గురువారం రోజున మూడు పంప్ హౌస్ లను ప్రారంభించడం ద్వారా లక్షా 25 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వనున్నారు … అక్కడ నుంచే మూడు పంప్ హౌస్ ల పైలాన్ ఆవిష్కరించనున్నారు … అనంతరం సీఎం ,డిప్యూటీ సీఎం ఇతర మంత్రులు వైరా లో ఏర్పాటు చేసిన బహిరంగసభ 2 లక్షల రైతు రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొంటారు …మొదటిసారి సీఎం హోదాలో ఖమ్మం జిల్లాకు అధికారిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు వస్తున్నా సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి…

Related posts

రేవంత్‌రెడ్డి అంతు చూస్తాం… అక్కడ చూపిస్తే రాజీనామా చేస్తా: అసెంబ్లీలో కేటీఆర్

Ram Narayana

‘తన్నులాట’ గురించి ఇంతకన్నా బాగా ఎవరూ చెప్పలేరు: రేవంత్‌రెడ్డి

Drukpadam

ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్త.. తెలంగాణ డీజీపీ ట్వీట్

Ram Narayana

Leave a Comment