Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీకి సీటు కేటాయింపులో కన్విన్సింగ్ గా లేని ప్రభుత్వ ప్రకటన!

రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుని హోదాలో ఎర్రకోటపై ప్రధాని జండా ఆవిష్కరించే వేడుకల్లో పాల్గొన్నారు …దశాబ్దకాలం తర్వాత ఒక ప్రతిపక్ష నేత స్వతంత్ర దినోత్స వేడుకలకు వెళ్లడం విశేషం …అయితే ఆయనకు సీటు కేటాయింపు విషయంలో ప్రభుత్వ వివరణ కన్విన్సింగ్ గా లేదనే చెప్పాలి …తాటి చెట్టు ఎందుకు ఎక్కువంటే దూడ గడ్డికోసం అన్నట్లుగా ఉంది ప్రభుత్వం తీరు …ప్రతిపక్ష నేత అంటే క్యాబినెట్ హోదాకలిగి ఉంటారు …మంత్రులకు కేటాయించిన విధంగా ముందు వరసలో సీటు కేటాయించాలి …అలాంటిది ఎక్కడో కూర్చోబెట్టటం అంటే ప్రోటోకాల్ ఉల్లంఘన కిందే లెక్క …కాంగ్రెస్ నేతలకు వెనక సీట్లు కేటాయించామని చెప్పడం కూడా సరైంది కాదు … అంతే కాకుండా రాహుల్ కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగం చేసింది …ఆయన నానమ్మ ఇందిరా , తండ్రి రాజీవ్ గాంధీలు ఉగ్రవాదుల చేతుల్లో బలైయ్యారు …అయినప్పటికీ వారి పట్ల చూపాల్సిన శ్రద్ద చూపకపోయినా ఒక ప్రతిపక్ష నేతగా దక్కాల్సిన గౌరవం దక్కకపోవడం పై ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది …

ఎర్రకోటలో 78వ స్వాతంత్య్ర వేడుకలలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇలా ప్రతిపక్ష నేత హాజరు కావడం దశాబ్దకాలం తర్వాత ఇదే మొదటిసారి. ఆయన ఒలింపిక్ విజేతలతో కలిసి కూర్చున్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. అదే సమయంలో రాహుల్ గాంధీకి వెనుక వరుసలో సీటు కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి.

ప్రోటోకాల్ ప్రకారం రాహుల్ గాంధీకి సీటును కేటాయించలేదని, ఆయనకు చివరి వరసలో ఇచ్చారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. చివరి రెండు వరుసలలో ఒలింపిక్ క్రీడాకారుల మధ్య కూర్చున్నారని పేర్కొంది. ప్రతిపక్ష నేతకు కేబినెట్ హోదా ఉంటుందని, మంత్రులకు సమానంగా ముందు వరుసలో సీటును కేటాయించాలని తెలిపింది. కేబినెట్ హోదా ఉన్న ఆయనకు ప్రాధాన్యతా క్రమంలో ముందు వరుసలో సీటు కేటాయిస్తారని వివరించింది.

అల్ప బుద్ధి ఉన్నవారి నుంచి పెద్ద విషయాలు ఆశించడం వ్యర్థమని, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాహుల్ గాంధీని ఐదో వరుసలో కూర్చోబెట్టడం సరికాదని స్పష్టం చేసింది. అయినప్పటికీ రాహుల్ గాంధీకి ఎలాంటి పట్టింపులేదని, ప్రజల సమస్యలను ఆయన లేవనెత్తుతూనే ఉంటారని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పేర్కొంది.

వివరణ ఇచ్చిన ప్రభుత్వం

కాంగ్రెస్ విమర్శలపై ప్రభుత్వం స్పందించింది. ఒలింపిక్ పతక విజేతలకు ముందు వరుసలో సీట్లు కేటాయించడంతో కాంగ్రెస్ ఎంపీలకు వెనుక వరుసలో కేటాయించినట్లు వెల్లడించింది.

Related posts

ప్రియాంక గాంధీని యూపీ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించిన కాంగ్రెస్ అధిష్ఠానం

Ram Narayana

ప్రచారానికి డబ్బుల్లేవని టికెట్‌ను వెనక్కి ఇచ్చేసిన కాంగ్రెస్ అభ్యర్థి…

Ram Narayana

బీజేపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్

Ram Narayana

Leave a Comment