Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

రూ.2 లక్షలు పైబడిన వారికి కూడా రుణమాఫీ చేస్తాం: తుమ్మల కీలక వ్యాఖ్యలు

  • ఏదైనా కారణంతో రుణమాఫీ జరగకపోతే వివరాలు సేకరిస్తామన్న తుమ్మల
  • రుణమాఫీ సమస్యలు ఉంటే బ్యాంకు, నోడల్ అధికారులను సంప్రదించాలని సూచన
  • గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బకాయిలను చెల్లించినట్లు వెల్లడి

ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, రూ.2 లక్షలు పైబడిన వారికి కూడా మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఏదైనా కారణంతో ఎవరికైనా రుణమాఫీ జరగకపోతే వివరాలు సేకరిస్తామని, ఆ వివరాలు పోర్టల్‌లో అప్ లోడ్ చేయాలని అధికారులకు ఇప్పటికే సూచించామన్నారు. రుణమాఫీకి సంబంధించి ఇంకా ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే బ్యాంకు, వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద నియమించిన నోడల్ అధికారులను సంప్రదించాలని సూచించారు.

శనివారం నల్గొండలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రూ.2 లక్షల లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేశామన్నారు. ఇప్పటి వరకు 22 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ చేశామన్నారు. రూ.17,933 కోట్ల నిధులు విడుదల చేసినట్లు చెప్పారు.

రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రూ.26,140 కోట్లు ఖర్చు చేసిందన్నారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బకాయిలన్నీ చెల్లించామని తెలిపారు. సూక్ష్మసేద్యం, ఆయిల్‌పామ్, పలు రాయితీ బకాయిలు చెల్లించామన్నారు. తమది చేతల ప్రభుత్వమని, దిగజారుడు రాజకీయాలు తమకు రావన్నారు.

Related posts

రైతు భరోసాపై కీలక నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు!

Ram Narayana

కవిత కస్టడీని పొడిగించిన కోర్టు…

Ram Narayana

హైడ్రాకు చట్టబద్ధత ఉందా?… కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే…!

Ram Narayana

Leave a Comment