తెలుగు రాష్ట్రాలు

ఓటుకు నోటు కేసు… ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

21-08-2024 Wed 15:14 | Both States

  • ఓటుకు నోటు కేసులో రెండు పిటిషన్లు దాఖలు చేసిన ఆళ్ల
  • రాజకీయ కక్షలకు కోర్టును వేదికగా చేసుకోవద్దని సుప్రీంకోర్టు సూచన
  • విచారణ జరిపిన జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం

ఓటుకు నోటు కేసులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో సీబీఐ విచారణను కోరుతూ ఆయన పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

రాజకీయంగా కక్షలు ఉంటే బయట చూసుకోవాలని… కోర్టులను వేదికగా చేసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. రాజకీయంగా బలం ఉంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డికి హితవు పలికింది. ఈ సందర్భంగా పిటిషనర్‌కు ఉన్న అర్హత, రాజకీయ నేపథ్యంపై ధర్మాసనం ఆరా తీసింది. పిటిషనర్‌కు హెచ్చరికలు జారీ చేసింది.

దాదాపు పదేళ్ల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసుపై ఆళ్ల సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాఫ్తును సీబీఐకి అప్పగించాలని వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది.

Related posts

చంద్రబాబు అరెస్ట్ వెనుక మోదీ, కేసీఆర్ ఉన్నారనే పక్కా సమాచారం ఉంది: మధు యాష్కీ

Ram Narayana

ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్తె పెళ్ళిలో ప్రత్యేక ఆకర్షణగా సీఎం రేవంత్ రెడ్డి ,ఏపీ మంత్రి నారా లోకేష్!

Ram Narayana

ఆసక్తికర పరిణామం …తెలంగాణాలో టికెట్ ఆశిస్తున్నా వ్యక్తికీ ఆంధ్రాలో టికెట్

Ram Narayana