Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ …!

ఎట్టకేలకు తెలంగాణకు నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికను ఏఐసీసీ ఖరారు చేసిందని సమాచారం… అనేక తర్జన భర్జనలు కులాలు సామాజికవర్గాల సమీకరణాల అనంతరం బి .మహేష్ కుమార్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తుంది …ఇప్పటికే రెడ్డి సీఎం గా ఉన్నందున అదే సామాజికవర్గానికి పదవి ఇవ్వడం కుదరదు …అదే సందర్భంలో ఎస్సీ సామాజికవర్గం నుంచి కొన్ని పేర్లు పరిశీలనకు వచ్చిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క ఉన్నందున ఎస్టీ సామాజికవర్గానికి చెందిన మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు బలంగా పరిశీలనకు వచ్చింది …అయితే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ఉపాధ్యక్షుడుగా ఇప్పటికే భాద్యతలు నిర్వహిస్తున్నారు …దీంతో ఆయన అనుభవం రాష్ట్ర నాయకులతో సత్సంబంధాలు ఉండటంతో ఆయన వైపు మొగ్గుచూపినట్లు వినికిడి …

అన్ని కోణాల నుంచి ఆలోచనలు అనంతరం తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి మార్పుపై సస్పెన్స్‌కు తెరదించారు . బీసీ నేత వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. అందరూ ఊహించిన విధంగానే పార్టీ పగ్గాలను బీసీ నేత, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్‌కు అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఇవాళ ఏఐసీసీ పెద్దలు నిర్వహించిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.ముందుగా మరో బీసీ నేత, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మధుయాష్కీ గౌడ్‌కు ఇస్తారని అంతా భావించారు. అంతకుముందు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు పేరు సైతం వినిపించింది. అయితే ముఖ్యమంత్రిగా రెడ్డి, డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు ఇప్పటికే కీలక బాధ్యతల్లో ఉండటంతో బీసీ సామాజికవర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని అధిష్టానం భావించి నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు..

మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేక పోయారని సమాచారం …అయితే పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి.. వారిలో సుదర్శన్ రెడ్డి , ప్రేమ్ సాగర్ రావు , మాల్ రెడ్డి రంగారెడ్డి ,శ్రీహరి , ఎమ్మెల్సీ అలీఖాన్ , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ,తదితరులు ఉన్నారు ..

Related posts

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం సర్వే చేయిస్తాం: రేవంత్ రెడ్డి

Ram Narayana

బీఆర్ యస్ ఖాళీ అవుతుంటే కేసీఆర్ తట్టుకోలేక పోతున్నారు …డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

అక్బరుద్దీన్ ఒవైసీని వచ్చేసారి కొడంగల్ నుంచి పోటీ చేయించి.. డిప్యూటీ సీఎం చేస్తా: రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment