Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ కూలీకి దొరికిన విలువైన వజ్రం…

  • వర్షాకాలంలో రాయలసీమలో వజ్రాల వేట
  • కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఓ వ్యవసాయ కూలీ చేతికి విలువైన వజ్రం
  • రూ.12 లక్షల నగదు, 5 తులాల బంగారం ఇచ్చి సొంతం చేసుకున్న వ్యాపారి

వర్షాకాలంలో రాయలసీమలో జోరుగా వజ్రాల వేట సాగుతుంటుంది. తొలకరి వర్షాలు పడగానే సీమ జిల్లాల్లోని చాలామంది వజ్రాల కోసం కుటుంబ సమేతంగా పొలాల బాటపడుతుంటారు. 

తాజాగా, కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఓ వ్యవసాయ కూలీ నక్కను తొక్కాడు! జొన్నగిరిలో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన ఓ కూలీకి విలువైన వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. వ్యవసాయకూలీకి రూ.12 లక్షల నగదు, ఐదు తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని సొంతం చేసుకున్ననట్టు తెలుస్తోంది. 

కాగా, రాయలసీమ ప్రాంతంలో దొరికిన వజ్రాలకు గతంలో భారీ ధర పలికిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ లభ్యమైన వజ్రాలను వ్యాపారులు తమ ఏజెంట్ల ద్వారా సేకరిస్తుంటారు. వాటిని ఎగుమతి చేసి భారీగా ఆదాయం ఆర్జిస్తుంటారు. ముఖ్యంగా, ఇలాంటి వజ్రాల వేటకు కర్నూలు, అనంతపురం జిల్లాలు ఎంతో ప్రసిద్ధికెక్కాయి.

Related posts

టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కిని నర్సింహులు

Drukpadam

గుండె బలహీనపడుతోందని చెప్పే ఐదు సంకేతాలు ఇవే!

Drukpadam

తెలంగాణ లో 19 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు…

Drukpadam

Leave a Comment