- తెలంగాణలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్
- జూనియర్ కళాశాలల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి సర్కార్ అనుమతి
- వచ్చే ఏడాది మార్చి వరకూ కళాశాలల్లో బోధనకు తాత్కాలిక నియామకాలు చేపడుతున్న ఇంటర్ కమిషనరేట్
తెలంగాణలో మరోసారి ఉద్యోగాల జాతరకు ప్రభుత్వం తెరలేపింది. తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలువుదీరిన నాటి నుండి నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అందిస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా జూనియర్ కళాశాలల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ అనుమతి నిచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జూనియర్ కళాశాలల్లో 1654 గెస్ట్ లెక్చరర్స్, 449 కాంట్రాక్ట్, 96 పార్ట్ టైమ్, 78 అవుట్ సోర్సింగ్, 3 మినిమమ్ టైమ్ స్కేల్ అధ్యాపకుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 31వరకూ కళాశాలల్లో బోధించేందుకు ఇంటర్ కమిషనరేట్ ఈ తాత్కాలిక నియామకాలు చేపడుతోంది.