Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

అమెరికాలో విషాదం.. మరో తెలుగు విద్యార్థి మృత్యువాత…

  • ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన రూపక్ రెడ్డి మృతి
  • ప్రమాదవశాత్తూ లేక్‌లో పడి కన్నుమూత
  • ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లిన యువకుడు

కారణాలు ఏమైనప్పటికీ అమెరికాలో ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్న భారతీయ విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా గణనీయ సంఖ్యలోనే ఉంటున్నారు. తాజాగా అమెరికాలో మరో తెలుగు విద్యార్థి జీవితం విషాదాంతమైంది.   

ఎన్నో కలలు, లక్ష్యాలతో అమెరికాలో ఎంఎస్ చదువుతున్న పెదిని రూపక్ రెడ్డి అనే 26 ఏళ్ల యువకుడు ప్రమాదవశాత్తూ ప్రమాదంలో ఓ లేక్‌లో పడి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం పట్టణానికి చెందిన అతడు.. తన స్నేహితులతో కలిసి మంగళవారం సాయంత్రం సమీపంలో ఉండే జార్జ్‌ లేక్‌కు వెళ్లాడు. 

సరస్సులో బోటుపై అందరూ సరదాగా గడిపారు. అయితే లేక్ మధ్యలో ఉన్న ఓ రాయిపైకి ఎక్కిన రూపక్ రెడ్డి ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రమాదవశాత్తూ అతడు పట్టుతప్పి నీటిలో పడిపోయాడు. బోటులో ఉన్న అతని ఫ్రెండ్స్ రక్షించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యం కాలేదు. ఆ తర్వాత రెస్క్యూ బృందం రంగంలోకి దిగి సరస్సులో నుంచి మృతదేహాన్ని వెలికితీసింది.

డెలవేర్‌లోని హారిస్‌బర్గ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో రూపక్ రెడ్డి ఎంఎస్‌ చేస్తున్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 8 నెలల కిందటే అతడు అమెరికా వెళ్లాడని చెప్పారు. కాగా రూపక్ రెడ్డి మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Related posts

తెలంగాణ, ఏపీ రాజకీయాలపై తుమ్మల కీలక వ్యాఖ్యలు

Ram Narayana

పల్లవి ప్రశాంత్ ఎందుకు గెలిచాడంటే .. పబ్లిక్ టాక్!

Ram Narayana

ముఖ్యమంత్రుల సమావేశంలో మేం తీసుకున్న నిర్ణయాలు ఇవే: భట్టి విక్రమార్క

Ram Narayana

Leave a Comment