Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ప్రభుత్వాన్ని పడగొట్టలేని బీజేపీ ఆటలు సాగవు …సీఎం సిద్దరామయ్య

  • ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించిన సీఎం
  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఆఫర్ చేస్తోందని వ్యాఖ్య 
  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బుకు ఆశపడబోరని విశ్వాసం వ్యక్తం చేసిన సిద్ధరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు ఆఫర్ చేస్తోందని అన్నారు. ‘‘బీజేపీ రూ. 100 కోట్లు ఆఫర్ చేస్తోందంటూ మా ఎమ్మెల్యే రవికుమార్ గౌడ్ నాకు చెప్పారు. ‘ఆపరేషన్ లోటస్’ ద్వారా మాత్రమే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఇచ్చిన తీర్పుతో వారు ఎప్పుడూ అధికారంలోకి రాలేదు. 2008, 2019లో ‘ఆపరేషన్‌ కమలం’, దొంగచాటు మార్గం ద్వారా అధికారంలోకి వచ్చారు’’ అని సీఎం సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్‌ పార్టీకి 136 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, తమ ప్రభుత్వాన్ని పడగొట్టడం అంత తేలిక కాదని సిద్ధరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీకి రాజీనామా చేయాల్సి ఉంటుందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎవ్వరూ డబ్బుకు ఆశపడేవారు లేరని, ఈ మేరకు తనకు విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Related posts

రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రచారం… స్పందించిన రఘురాం రాజన్!

Ram Narayana

బీజేపీతో తాను సన్నిహితంగా ఉన్నానంటూ తప్పుడు ప్రచారం:డీకే శివకుమార్

Ram Narayana

‘మోదీ కా పరివార్’ బలాన్నిచ్చింది… ఇక ఆ నినాదాన్ని తొలగించండి: ప్రధాని మోదీ

Ram Narayana

Leave a Comment