Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తెలంగాణ‌లో ‘మీ సేవ‌’ ద్వారా మరో 9 ర‌కాల సేవలు…

  • త‌హ‌సీల్దారు కార్యాల‌యాలకు వెళ్లకుండానే పలు ధ్రువపత్రాల జారీ
  • పౌరుడి పేరు మార్పు, మైనార్టీ సర్టిఫికేట్‌, ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, స్ట‌డీ గ్యాప్ సర్టిఫికేట్‌
  • తగిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు భూ పరిపాల‌న ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ఆదేశాలు

తెలంగాణ‌లో ఇప్పటివరకు తహసీల్దారు కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది ద్వారా అందుతున్న తొమ్మిది రకాల సేవలు ఇక నుంచి ‘మీ సేవ’ ద్వారా అంద‌నున్నాయి. దీనికి వీలుగా తగిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు భూ పరిపాల‌న ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ఆదేశాలు జారీ చేసింది. 9 ర‌కాల ప‌త్రాల‌కు సంబంధించిన వివ‌రాలను త‌క్ష‌ణ‌మే మీ సేవ ఆన్ బోర్డ్‌లో ఉంచేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించింది.  

అందుబాటులోకి రానున్న తొమ్మిది కొత్త సేవ‌ల్లో స్థానికత నిర్ధార‌ణ‌ ధ్రువీకరణ పత్రం, క్రిమీ లేయర్‌, నాన్‌ క్రిమీలేయర్‌ ధ్రువీకరణ పత్రాలు, స్ట‌డీ గ్యాప్ సర్టిఫికేట్‌, పౌరుడి పేరు మార్పు, మైనార్టీ సర్టిఫికేట్‌, ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, ఆర్ఓఆర్‌-1బీ స‌ర్టిఫైడ్ కాపీలు, మార్కెట్‌ విలువ మీద ధ్రువీకరణ పత్రాలు, రెవెన్యూ రికార్డులకు (ఖాస్రా, ప‌హాణీ) సంబంధించిన  ధ్రువీకరణ ప‌త్రాలు ఉన్నాయి.

Related posts

నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి అభయం ….నిరసనలు వద్దని హితవు …

Ram Narayana

కడియం శ్రీహరీ… తస్మాత్ జాగ్రత్త!: హెచ్చరించిన ఎమ్మెల్యే రాజయ్య…

Drukpadam

25 మంది బీఆర్ యస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు …

Drukpadam

Leave a Comment