మున్నేరు వరద ముంపు ప్రాంతాలలసహాయక చర్యలు యుద్దప్రతిపాదన సంకల్ప దీక్ష గా చేపట్టామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టర్ ఖమ్మం, పాలేరు నియోజకవర్గంలోని మున్నేరు వరద పరివాహక ప్రాంతాలు బొక్కలగడ్డ, మంచికంటినగర్, పద్మావతినగర్, కరుణగిరి, సాయిప్రభాత్ నగర్, రాజీవ్ గృహకల్ప, వికలాంగుల కాలనీ లలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు చేస్తూ కాలినడకన ఇంటింటికి తిరుగుతూ వెళ్లి వరద నష్టాన్ని పరిశీలించారు. కలెక్టర్ మున్నేరు బాధిత కుటుంబాలతో మాట్లాడుతూ ఓదార్చారు. వర్షం వరద విపత్తుల వల్ల అస్తి నష్టం జరిగిందని, మనం సురక్షితంగా ఉన్నాం కదా అని దైర్ఘ్యం చెప్పారు. అస్తి నష్టం అంచనా అధికారులు గురించి వివరాలు సేకరిస్తున్నాని తెలిపారు. ఒకే ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉన్న వేర్వేరుగా కుటుంబాల ఆధారంగానే నష్టపరిహారం వస్తుందని ఏలాంటి ఆపోహలు నమ్మవద్దు అని చెప్పారు. ఇళ్లలో బురద తొలగించేందుకు ఇంటినల్ల ద్వారా నీటి సరఫరా ఇస్తుమని అన్నారు. ఇంటి నల్లాలు ఏమైనా దెబ్బతింటే మరమ్మత్తు లు చేస్తున్నామని వివరించారు. ఇంటి నల్లా సౌకర్యం లేనివారికి ఫైరింజన్ ద్వారా వాటర్ ఫేజర్ తో బురదను తొలగిస్తున్నామని పెర్కొన్నారు. దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లు, ప్రాంతాలను పరిశీలించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులో మందులను తనీఖి చేశారు. వరద ముంపు సహాయక తాత్కాలిక వసతిగృహణాలను కలెక్షన్ సందర్శించారు. పునరావాస కేంద్రంలో ఉన్నవారికి నాణ్యమైన బోజనం, త్రాగునీరు, ఉదయం అల్ఫాహరం, టీ అందించాలని అధికారులకు సూచించారు. వరద భాదితులు అపదలో ఉన్నారు వారికి మంచి సౌకర్యాలు కల్పించాలని దిశానిర్దేశం చేశారు. జిల్లాలో గడిచిన కాలంలో ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున వరదలు ఎప్పుడూ రాలేదన్నారు. ప్రజలకు అండగా ఉంటూ అధికారులు క్షేత్ర స్థాయిలో ఇంటింటికి తిరిగి జరిగిన నష్టంపై నివేదిక సిద్ధం చేయాలన్నారు. బొక్కలగడ్డలో వరద బాధితులకు కలెక్టర్ బియ్యం, నిత్యావసర సరుకులు, పాల ప్యాకెట్ లను పంపిణీ చేశారు.