సీఎం కు దమ్ముంటే మమతా హాస్పటల్ కూల్చాలని పువ్వాడ అజయ్ సవాల్
మమత ఆసుపత్రిని ఒక్క గజం కూడా ఆక్రమించి కట్టలేదని వివరణ
మీ ప్రభుత్వమే కదా ! దమ్ముంటే విచారణ చేయండి
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే సోయి మర్చి మాట్లాడటం సరికాదు..
వరద భాదితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టే ఇలాంటి చెత్త మాటలని విమర్శ
రేవంత్ రెడ్డి ఒక అవగాహన లేని అసమర్థ ముఖ్యమంత్రి అంటూ మండిపాటు
మాపై దాడులు చేస్తే ఉరుకుంటామా…?
మీ పక్కన కూర్చున్నవారే ఆక్రమణ దారులు
నన్ను చంపితే వరద భాదితుల కష్టాలు తీరతాయా …?
మమతా హాస్పటల్ లో ఒక్క గజం ఆక్రమణ స్థలం లేదని ఉంటె ప్రభుత్వం మీదే కదా ..? దమ్ముంటే కూల్చాలని మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు …నీకు ఇష్టం వచ్చింది చేసుకో రేవంత్ రెడ్డి..ఒక గజం కూడా నేను ఆక్రమించలేదని సీఎం ఖమ్మంలో చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు .. బుధవారం హైద్రాబాద్ లోని బీఆర్ యస్ కార్యాలయం ప్రజాభవన్ లో సీఎం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు ..రేవంత్ రెడ్డి సీఎం అనే సోయి మర్చిపోయి మాట్లాడుతున్నారని, అవగగనలేని అసమర్థ ముఖ్యమంత్రి అంటూ ధ్వజమెత్తారు …వరదలకు ప్రజలను అప్రమత్తం చేయడంలో , తరువాత వారికీ సహక చర్యలు అందించడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ప్రజల నుంచి విషయాలు పక్కదార్లు పట్టించుకునేందుకు ఇలాంటి చవకబారు ఆరోపణలు చేస్తుందని విమర్శించారు ..
ఒక వైపు ముఖ్యమంత్రి మాపై భౌతిక దాడులు చేపిస్తూనే ,వ్యక్తిత్వ హననం చేస్తున్నారని అన్నారు …. ఖమ్మంలో వరద భాదితులను పరామర్శించేందుకు వెళ్లిన మమ్మల్ని అంత మొందించడానికే తుమ్మల అనుచరులు,కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని ఆరోపించారు
జలగం నగర్,రాజీవ్ గృహ కల్ప కట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం..అది కూడా తెల్వదు సీఎంకి ఆయనొక అసమర్థ ముఖ్యమంత్రి .. ఎంత అసమర్థ ప్రభుత్వం అంటే వరదల వస్తున్న సందర్భంగా కనీసం ప్రజలను అప్రమత్తం కూడా చేయకపోవడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు ..గతంలో తాము ప్రభుత్వం లో ఉన్నప్పుడు ఎలా చేసమో సోషల్ మీడియాలో విషయాలు వీడియోలతోసహా వైరల్ అవుతున్నాయి..అది చూసి తట్టుకోలేక పోతున్నారని అందుకు దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు …దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నవా..చూస్తూ ఊరుకొం అని అన్నారు …
మమత ఆసుపత్రి నార్త్ లో ఉన్నది అనే సోయి లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు..దాని వల్లనే మున్నేరు వరద వచ్చింది అనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు…ఖమ్మం మున్నేరుకు రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టట్లేదు..?ముందు అది కట్టండి హితవు పలికారు …
ఆక్రమణలు ..ఆక్రమణలు అంటున్న ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నవారి సంగతి తేల్చాలని అన్నారు …ఖమ్మం మంత్రుల ఫంక్షన్ హాల్స్,విల్లాలే ఏ అక్రమంగా కట్టారు..
వారి ఆక్రమణల పై స్పీకింగ్ ఆర్డర్స్ ఉన్నాయి,కోర్టు నుండి స్టేలు తెచ్చుకున్నారు అని అన్నారు …
మరోసారి చెపుతున్న నేను ఒక్క ఇంచు అక్రమించినట్టు ఉంటే దమ్ముంటే చర్యలు తీసుకోండి..ముందు వరద బాధితులకు న్యాయం చేయండి అంటే కాంగ్రెస్ వాళ్లు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు..నన్ను చంపితే,ఖమ్మం వరద బాధితుల బాధ తిరుతాదా??
ప్రభుత్వంలో ఇప్పటికైనా చలనం రావాలి, మా పై దాడులు చేయడం కాదు..
రిటైనింగ్ వాల్ కడితే నాకు పేరు వస్తది అని కట్టట్లేదు అనుకుంటా..ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా మీకే వస్తది..ముందు అది కట్టండి…నిన్న దాడిలో తుమ్మల నాగేశ్వరరావు ప్రమేయం లేదు అంటే,ముందు దాడి చేసిన వారిని అరెస్టు చేపించాలి కదా అంటే అర్ధం ఏమిటని ప్రశ్నించారు ..