Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

వరద భాదితుల కోసం హెటిరో డ్రగ్స్ అధినేత ఎంపీ బండి పార్ధసారధి రెడ్డి భూరీ విరాళం!

హెటిరో సంస్థల, సింధు హాస్పిటల్స్ చైర్మన్ రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి ఇటీవల భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన ప్రజలకు చేయిత నిచ్చేందుకు ముందుకు వచ్చారు ..ప్రధానంగా తన స్వంత జిల్లా ఖమ్మం నగరం పాలేరు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలూ కాలనీలు మొత్తం నీటమునగటంపై ఆయన చలించిపోయారు … తాను కూడా ఖమ్మం ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ కాలేజీలో చదువుకున్నానని తన చిన్నపటినుంచి ఎప్పుడు ఎలాంటి వరదలు అపార నష్టం ఇక్కడ జరగలేదని మీడియా ప్రతినిధులతో అన్నారు …తన విరాళం నేరుగా సీఎం కు ఇవ్వవచ్చు కానీ జిల్లా వాసిగా ఈ డబ్బును జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా ఖమ్మం ,పాలేరు నియోజకవరాగాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలు అందజేయాలనే ఉద్దేశంతోనే హైద్రాబాద్ నుంచి ఇక్కడ వచ్చానని అన్నారు ..గురువారం ఉదయం ఖమ్మం కలెక్టరేట్ కు మాజీ శానసభ్యులు సండ్ర వెంకటవీరయ్యతో కలిసి వచ్చిన పార్థసారధిరెడ్డి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ను కలసి కోటి రూపాయల చెక్కును అందించారు …కలెక్టరేట్ ఆవరణలో హైద్రాబాద్ లోని సింధు హాస్పిటల్ ఆధ్వరంలో తన వెంట తీసుకోని వచ్చిన రెండు అంబులెన్స్ లను డాక్టర్ల బృందాన్ని ,సిబ్బందిని వరద భాదిత ప్రాంతాల్లో ఎన్ని రోజులు అవసరం ఉంటె అన్ని రోజులు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కు తెలిపారు .. కలెక్టర్ వైద్య సహాయం చేసే భాద్యతలను జిల్లా వైద్యాధికారి కి అప్పగించారు …రెండు సంవత్సరాల క్రితం వరదలు వచ్చినప్పుడు కూడా పార్డసారధి రెడ్డి కోటి రూపాయలు విరాళం అందజేయడంతోపాటు , కొత్తగూడెం జిల్లాలో సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన సహాయం మందులు భాదితులకు అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు …

కలెక్టర్ అభినందన

వరదబాధితులకు కష్ట కాలంలో తాను ఉన్నానని హైద్రాబాద్ నుంచి స్వయంగా ఇక్కడకు వచ్చి కోటి రూపాయల చెక్కును అందించడంతోపాటు వైద్య బృందాన్ని రెండు ఆంబులెన్స్ లను సిబ్బందిని ఇక్కడ అప్పగించి కావాల్సినన్ని రోజులు వాడుకోమని చెప్పి అవసరమైన మందులు పంపిస్తానని తెలిపిన రాజ్యసభ సభ్యులు , హెటిరో సంస్థల , సింధు హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బండి పార్ధసారధి రెడ్డికి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అభినందనలు తెలిపారు …

కోటి రూపాలు ఖమ్మంలో ఖర్చు పెట్టాలని తన విజ్ఞప్తి

తన అందజేసిన కోటి రూపాయల విరాళం ఖమ్మం జిల్లాలోని విపత్తు ప్రాంతాలైన ఖమ్మం పాలేరు ప్రజలు ఖర్చు పెట్టాలని కోరుకుంటున్నానని అన్నారు …తాను ఒక పారిశ్రామిక వేత్తగా , ఎంపీగా , ఉండటానికి తనకు చదువు చెప్పిన ఖమ్మం అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు .తాను గుట్టల బజారులో రూమ్ ఉండి వండుకొని తిని చదువుకున్నానని అందువల్ల ఖమ్మంలో విపత్తు అంటే నా మనసు చెలించిందని అన్నారు …వరద భాదిత ప్రాంతాల ప్రజలు త్వరగా ఆ విపత్తు నుంచి బయటపడాలంటే సహాయం అందించాలని అన్నారు …

ఏపీ కోటి సహాయం …

ఆంధ్రప్రదేశ్ లో కూడా కృష్ణనదికి వచ్చిన భారీ వరదలతో విజయవాడ మొత్తం నీట మునిగింది …అక్కడ ప్రజలను ఆదుకునేందుకు కోటి రూపాయల విరాళం హెటిరో డ్రగ్స్ ద్వారా తమ డైరక్టర్లు సీఎం లేదా అధికారులకు అందజేస్తారని పార్థసారధిరెడ్డి తెలిపారు

Related posts

హైద‌రాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిష్ఠాపన..

Ram Narayana

చంద్రబాబును చూడగానే బాధ కలిగింది… మాట్లాడలేకపోతున్నారు: కాసాని

Ram Narayana

అమ్మకు వందనం….

Ram Narayana

Leave a Comment