- ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరద బీభత్సం
- భారీ వర్షాలు, వరదలతో రెండు రాష్ట్రాల ప్రజల అతలాకుతలం
- ఓవైపు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పర్యటిస్తుండగానే, సాయం ప్రకటించిన కేంద్రం
- శివరాజ్ సింగ్… ప్రధానికి వివరాలు తెలిపిన తర్వాత మరోసారి సాయం ప్రకటించే అవకాశం
ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రస్థాయిలో నష్టం చవిచూసిన తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం ఉదారంగా స్పందించింది. ఏపీ, తెలంగాణలకు రూ.3,300 కోట్ల వరద సాయం ప్రకటించింది.
రెండు రాష్ట్రాలో భారీగా వరద నష్టం జరిగిన నేపథ్యంలో, ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సిన చర్యల కోసం ఈ నిధులు విడుదల చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఓవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తుండగానే, కేంద్రం ఈ తక్షణ సాయం ప్రకటించింది.
శివరాజ్ సింగ్ ఏపీ, తెలంగాణలో వరద పరిస్థితులు, పంట నష్టం వివరాలను ప్రధాని మోదీకి తెలియజేసిన తర్వాత కేంద్రం మరోసారి సాయం ప్రకటించే అవకాశాలున్నాయి.