Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్… పోలీస్ వాహనాలను అడ్డుకున్న కార్యకర్తలు!

  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసాన్ని ముట్టడించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
  • గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్న బీఆర్ఎస్ నేతలు
  • సీపీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతల బైఠాయింపు
  • అరెస్ట్ చేసిన పోలీసులు

తమ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు దాడి చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఇవాళ హైదరాబాదులో పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద బైఠాయించిన సంగతి తెలిసిందే. 

అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్న డిమాండ్ తో వారు ఆందోళన చేపట్టారు. దాంతో పోలీసులు హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి తలకొండపల్లి పీఎస్ కు వాహనాల్లో తరలించే ప్రయత్నం చేశారు. 

అయితే రంగారెడ్డి జిల్లా కొత్తపేట వద్ద పోలీస్ వాహనాలను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి, రేవంత్ రెడ్డి దొంగ, సీఎం డౌన్ డౌన్ అంటూనినాదాలు చేస్తూ పోలీస్ వాహనాలను నిలిపివేశారు. వారు పోలీస్ వాహనాల ముందు బైఠాయించారు. 

వందల సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు రావడంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దాంతో వారిని చెల్లాచెదురు చేసేందుకు పోలీసు లాఠీ చార్జి చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. దాదాపు రెండున్నర గంటలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీస్ వాహనాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది.

Related posts

అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్!: కేంద్రమంత్రి పదవిపై కిషన్ రెడ్డి వ్యాఖ్య…

Drukpadam

ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు సహా ఏడుగురు నక్సల్స్ మృతి!

Ram Narayana

నాగార్జున సత్యహరిచంద్రుడు ఏమి కాదు …సిపిఐ నేత నారాయణ విసుర్లు

Ram Narayana

Leave a Comment