Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేటీఆర్ పై పొంగులేటి ఫైర్ ..పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక!

అమృత్ టెండర్లలో అక్రమాలు జరిగాయన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. అనవసర ఆరోపణలు చేసినందుకు గాను కేటీఆర్‌పై పరువు నష్టం దావా వేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లి శాపనార్థాలు మానుకోవాలి ..కేటిఆర్ పై చట్ట రీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు ..కేటిఆర్ సీఎం రేవంత్ పై చేసిన ఆరోపణలు అసత్యం,అర్ధరహితం తప్పుడు ఆరోపణలు చేయడం వారికీ అలవాటుగా మారిందని ,బురదజల్లడం కడుక్కోమని చెప్పటం వారికే చెల్లిందని ధ్వజమెత్తారు. టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ …కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో సీఎం,మంత్రులులపై మాట్లాడటం ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు ..

సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ… తాము రూ.8,888 కోట్లకు టెండర్లు పిలిచినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, నిరూపించకుంటే కేటీఆర్ రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు. రూ.8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలన్నారు.

పోలింగ్ తేదీకి ఒకరోజు ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే టెండర్లను కట్టబెట్టిందన్నారు. వాటిలో ఏపీ పెద్దిరెడ్డి కంపని… మేఘ- గజ కంపెనీలకు ..3.99 శాతం ఎక్సెస్ తో ఇచ్చింది నాటి ప్రభుత్వంటెండర్లను రూ.3,616 కోట్ల చొప్పున మూడు ప్యాకేజీలుగా పిలిచారని పొంగులేటి ఆరోపించారు. ఈ టెండర్లలో ఒక దానిని ఖమ్మంలో తనపై పోటీ చేసిన ఉపేందర్ రెడ్డి కూడా దక్కించుకున్నారని తెలిపారు. టెండర్లు వేయవద్దని తాము ఎవరినీ బెదిరించలేదన్నారు.ఆ టెండర్లను పాత ఎస్ ఎస్ ఆర్ రేట్ల తోనే తమ ప్రభుత్వం టెండర్ల పిలిచిందన్నారు …

జెవి సోదా కంపనీ ,ఏ ఎం కంపెనీ లకు గతం కంటే 54 కోట్లు తక్కువ టెండర్లు ఇచ్చామన్నారు .. రేవంత్ రెడ్డి భావమర్ది సృజన్ కు ఇచ్చినట్లు కేటీఆర్ ఆరోపించడాన్ని తప్పు పట్టారు సృజన్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి స్వంత బావమ్మర్ది కాదని బీఆర్ యస్ నేత మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అల్లుడని అన్నారు ..పాలమూరు రంగారెడ్డిలో… పాకేజీ 7 .. 2300 కోట్ల పని ఇచ్చింది కెసిఆర్ ప్రభుత్వం కూదా.? అని పొంగులేటి అన్నారు … నాడు కాంగ్రెస్ నుంచి గెలిచినా ఉపేందర్ బీఆర్ యస్ లోకి వెళ్లినందుకు సృజన్ కాంట్రాక్ట్ యిచ్చింది నిజంకదా అని ప్రశ్నించారు .. తాము టెండర్లు వేయవద్దని ఏ కంపనీ నీని బెదిరించలేదన్నారు .. గుడ్డకాల్చి మీద వేయడం మానుకోవాలని కేటీఆర్ కు పొంగులేటి హితవు పలికారు …కేటీఆర్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని నిరూపించలేకపోతే కేటీఆర్ రాజీనామా చేయాలని పొంగులేటి సవాల్ విసిరారు

బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ పేరుతో రూ.39 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. వీలైతే ప్రభుత్వానికి సూచనలు చేయాలని, సద్విమర్శలు చేయాలని కేటీఆర్‌కు హితవు పలికారు.

Related posts

తెలంగాణలో 11 లోక్ సభ స్థానాలకు పరిశీలకులను నియమించిన కాంగ్రెస్!

Ram Narayana

కేటీఆర్‌ను సీఎం చేసినా నాకు ఓకే: హరీశ్ రావు

Ram Narayana

కేసీఆర్ ది పదవీ వ్యామోహం..అధికారం పోయిన అహంకారం తగ్గలేదు …మంత్రి పొంగులేటి ధ్వజం..!

Ram Narayana

Leave a Comment