- స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో యూరోపియన్ అసోసియేషన్ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటిక్ వార్షిక సదస్సు
- హాజరైన గుంటూరు షుగర్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎ.రామ్‌కుమార్
- త్వరలోనే భారత్‌లో అందుబాటులోకి క్యూఎల్ఐ ఇంజెక్షన్
మధుమేహం(షుగర్)తో బాధపడుతూ నిత్యం ఇన్సులిన్ తీసుకునే వారికి ఇది శుభవార్తే. షుగర్‌తో బాధపడుతున్న వారు బాసల్ ఇన్సులిన్ (రోజుకోసారి ఇన్సులిన్ ఇంజక్షన్) తీసుకుంటుంటేఅటువంటివారు .. త్వరలోనే వారానికి ఒకసారి (ప్రతి ఆదివారం) ఇన్సులిన్ తీసుకుంటే సరిపోతుందని గుంటూరుకు చెందిన షుగర్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎ.రామ్‌కుమార్ తెలిపారు. దీనిపేరు క్యూఎల్ఐ అని పేర్కొన్నారు. ప్రస్తుతం పలు దేశాల్లో అందుబాటులో ఉన్న ఈ ఇంజక్షన్ త్వరలోనే భారత్‌లోనూ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో నిర్వహించిన యూరోపియన్ అసోసియేషన్ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటిక్ వార్షిక సదస్సుకు 30 దేశాల నుంచి 13 వేలకు పైగా వైద్యులు హాజరయ్యారు. ఇందులో మధుమేహం నూతన చికిత్సా విధానాలు, పరికరాలపై చర్చించినట్టు డాక్టర్ రామ్‌కుమార్ తెలిపారు. ఆహార నియంత్రణ పాటిస్తూ, లోక్యాలరీ డైట్ తీసుకుంటూ వారానికి ఒక్కసారి ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకున్నా సరిపోతుందని బ్రిటన్‌కు చెందిన ప్రొఫెసర్ రాయ్ టేలర్ చేసిన పరిశోధనల్లో వెల్లడైనట్టు డాక్టర్ రామ్‌కుమార్ వివరించారు.