Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

వైసీపీకి ఆర్ కృష్ణయ్య గుడ్‌బై.. త్వరలో బీజేపీలో చేరిక?

  • తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదం ఎత్తుకున్న బీజేపీ
  • ఈ విషయంలో మరింతగా ముందుకెళ్లాలని భావిస్తున్న కాషాయ పార్టీ
  • ఆర్ కృష్ణయ్యతో బీజేపీ జాతీయ నేత చర్చలు!
  • కీలక పదవి ఇచ్చేందుకు పార్టీ పెద్దల రెడీ!

అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం మూటగట్టుకున్న వైఎస్సార్ సీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. మరికొందరు అదే దారిలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ రాజ్య సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. 

తెలంగాణలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదాన్ని ఎత్తుకున్న బీజేపీ ఈ విషయంలో మరింతగా ముందుకెళ్లాలని భావిస్తోంది. అందులో భాగంగా బీసీల్లో పట్టున్న సీనియర్ నేత ఆర్ కృష్ణయ్యను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఓటు బ్యాంకును పెంచుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా కృష్ణయ్యతో జరిపిన చర్చలు ఫలించినట్టు తెలిసింది. 

పార్టీ జాతీయ అగ్రనేత జరిపిన ఈ చర్చలు ఫలవంతమైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో ఆయనకు కీలక పదవి ఇవ్వనున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఆర్ కృష్ణయ్య దాదాపు పదేళ్లపాటు ఆరెస్సెస్, ఏబీవీపీలో పనిచేసిన నేపథ్యంలో ఆ సంస్థ ముఖ్యులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నెల 13న కృష్ణయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం ఆయన పార్టీలో చేరబోతున్నారన్న వార్తలకు బలం చేకూరుస్తోంది.

Related posts

అజ్ఞాతంలో మోహ‌న్ బాబు.. పోలీసుల గాలింపు…

Ram Narayana

 ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద తనయుడి పెళ్లి కార్డు ఉంచిన షర్మిల… ఫొటోలు ఇవిగో!

Ram Narayana

కొణిజేటి రోశయ్య నిఖార్సైన హైదరాబాదీ: రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment