బీజేపీ సభ్యత్వ నమోదులో తమిళనాడు అంటే గర్వపడేలా చేయాలి …డాక్టర్ పొంగులేటి
గుజరాత్ ,కర్ణాటక ,మధ్యప్రదేశ్ సరసన చేరాలి
ప్రధాని మోడీ నాయకత్వాన్ని మరింతగా బలపరచాలి
బీజేపీకి ప్రజల నుంచి వస్తున్న స్పందన అపూర్వం
జిల్లాలు సభ్యత్వ నమోదులో చురుకుగా వ్యవహరించాలి …పురందరేశ్వరి
బీజేపీ సభ్యత్వ నమోదులో తమిళనాడు అంటే గర్వపడేలా చేయాలనీ అందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలనీ తమిళనాడు ,కర్ణాటక బీజేపీ సహా ఇంచార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు …శనివారం విళుపురం జిల్లా దిండివనం లో జరిగిన రాష్ట్ర బీజేపీ కొర్ కమిటీ సదస్యత అభియాన్ రాష్ట్రస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు ..బీజేపీ క్రమశిక్షణకు ,నిబద్ధతకు కట్టుబడి పనిచేస్తుందని తెలుసుకున్న ప్రజలు బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారని అన్నారు …మనం దేశంలో జరుగుతున్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ,మోడీ నాయకత్వంలో ప్రపంచంలోని బలీయమైన ఆర్థికశక్తిగా ఎదుగుతున్న తీరును వివరించాలని పిలుపు నిచ్చారు … గౌరవనీయులైన ప్రధాని మోదీగారి నాయకత్వాన్ని మనమే కాదు యావత్ ప్రపంచమే అంగీకరిస్తుంది అన్నారు …దేశం గర్వపడేలా మోడీ నిర్ణయాలు ప్రపంచదేశాలలోనే ప్రసంశలు అందుకుంటున్న విషయాన్నీ మరువరాదని అన్నారు ..
సమావేశంలో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి జిల్లాలు తమ సభ్యత్వ లక్ష్యాలను అధిగమించేందుకు మార్గనిర్దేశం చేశారు. హెచ్. రాజా మరియు కేశవ వినాయకన్ వ్యూహాత్మక దిశానిర్దేశం చేశారు .సమావేశంలో పాల్గొన్న సభ్యుల సందేహాలను తీర్చారు . విదేశీ పర్యటనలో ఉన్న కె. అన్నామలై ఇచ్చిన వీడియో సందేశం ప్రేరణాత్మకంగా ఉంది .
హెచ్.రాజా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యుడు పొన్ రాధాకృష్ణన్, మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, మాజీ గవర్నర్, కేశవ వినాయకన్ హాజరయ్యారు. సంస్థాగత జిఎస్, రాష్ట్ర విపిలు, కారు నాగరాజ్, కె.పి. రామలింగం, ప్రొఫెసర్ కనగసబాపతి మరియు వి.పి. దురైస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఎ.పి.మురుగానందం, కరుప్పు మురుగానందం, ఎస్.ఆర్. శేఖర్, రాష్ట్ర కోశాధికారి, కడలి నరసింగపెరుమాళ్, జోనల్ ఇంచార్జి, ఉమరాతి రాజన్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు వినోజ్ పి. సెల్వం, రాష్ట్ర కార్యదర్శి, బి.జి. మోహనరాజు తదితరులు పాల్గొన్నారు …
అనంతరం రాష్ట్ర సభ్యత్వ అభియాన్ జిల్లా అధ్యక్షులు, జిల్లా స్థాయి మెంబర్‌షిప్ డ్రైవ్ కోఆర్డినేషన్ కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కొనసాగుతున్న సభ్యత్వ డ్రైవ్ పురోగతిని సమీక్షించింది మరియు సమాజంలోని ప్రతి వర్గాన్ని నిమగ్నమై ఉండేలా బిజెపి పరిధిని విస్తరించే వ్యూహాలపై దృష్టి సారించింది.
Tamil Nadu should be proud of BJP membership registration…Dr. Ponguleti
Join against Gujarat, Karnataka and Madhya Pradesh
Prime Minister Modi’s leadership should be strengthened
The response from people to BJP is unprecedented
Districts should be active in membership registration … Purandareshwari
Dr. Ponguleti Sudhakar Reddy, in-charge of Tamil Nadu and Karnataka BJP, said that Tamil Nadu should be proud of BJP membership registration and every worker should work for it…Participated in the meeting of state level workers of BJP Core Committee Sadasyata Abhiyan held in Villupuram district Dindivanam on Saturday. He said that people are attracted to BJP after knowing that it is working…He called to explain the development and welfare programs we are doing in the country and how we are growing into a formidable economic power in the world under the leadership of Modi…He said that not only us but the whole world accepts the leadership of honorable Prime Minister Modi…Modi’s decisions to make the country proud are receiving praise from all over the world. He said that the matter should not be forgotten.
AP BJP President Daggubati Purandeshwari, who participated in the meeting, guided the districts to surpass their membership targets. H. Raja and Kesava Vinayakan gave strategic direction and cleared the doubts of the members who participated in the meeting. The video message given by K. Annamalai who is on a foreign tour is motivational.
National executive member Pon Radhakrishnan, former governor Dr. Tamilisai Soundararajan, former governor, Kesava Vinayakan attended the meeting chaired by H. Raja. Institutional GS, State VP, Karu Nagaraj, K.P. Ramalingam, Professor Kanagasabapathy and V.P. Duraiswamy, State Chief Secretaries, A.P. Muruganandam, Karuppu Muruganandam, S.R. Shekhar, State Treasurer, Kadali Narasingaperumal, Zonal Incharge, Umarathi Rajan, Mahila Morcha State President Vinoj P. Selvam, State Secretary, B.G. Mohanaraju and others participated…
Later, a review meeting was held with the district presidents of the state membership drive and the district level membership drive coordination committee. The meeting reviewed the progress of the ongoing membership drive and focused on strategies to expand BJP’s reach to engage every section of society.