అమెరికాలోని లాస్ వేగాస్ మైన్ ఎక్స్ పో లో డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లు
మైన్ ఎక్స్ పోలో 2 వేలకు పైగా ఆధునిక యంత్ర తయారీ సంస్థలు
121 దేశాల నుండి 40 వేల మంది ప్రతినిధులు
మైన్ ఎక్స్ సందర్భంగా సదస్సులో ప్రసంగించనున్న డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లు
మూడు రోజుల ప్రదర్శనకు అత్యాధునిక, భారీ మైనింగ్ ఖనిజ ఉత్పత్తి యంత్రాలు
తెలంగాణ లో మైనింగ్ లో ఆధునిక సాంకేతికత వినియోగం.. ఇతర రంగాల్లో అవకాశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలో అధ్యయనం
డిప్యూటీ సీఎం వెంట ఇంధన శాఖ కార్యదర్శి శ్రీ రోనాల్డ్ రోస్, ఆర్థిక, ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ కృష్ణ భాస్కర్, సింగరేణి సీఎండీ శ్రీ ఎన్.బలరామ్, ఇతర అధికారులు
మైనింగ్ సాంకేతికతలపై అధ్యయనానికి తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నత స్థాయి బృందం
క్రిటికల్ మినరల్స్ రంగంలో అన్వేషణ అవకాశాలు.. విస్తరణపైనా దృష్టి సారిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు