ఢిల్లీ స్కూల్ లో టీచర్స్ డుమ్మా …సీఎం అతిశీ ఆకస్మిక తనిఖీలో ఆశ్చర్యకర విషయాలు
ప్రభుత్వ పాఠశాలలో అనుమతి లేకుండానే డుమ్మాకొట్టిన ఉపాధ్యాయులు …
ఆశ్చర్యపోయిన ఢిల్లీ సీఎం ..ప్రిన్సిపాల్ ను నిలదీశిన సీఎం
నీళ్లు నమిలిన ప్రిన్సిపాల్ …పొంతనలేని సమాధానాలు
ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం అతిశీ…
మొత్తం 19 మంది టీచర్స్ కు 11 మందే హాజరు ..డుమ్మాకొట్టిన 8 మంది
ఇది సర్కార్ బడులంటే …ఢిల్లీ అయినా గల్లీ అయినా జీతం తీసుకుంటున్న ఉపాధ్యాయులు పాఠశాలకు డుమ్మాకొట్టడం రివాజుగా మారింది …ఎవరు అధికారంలో ఉంటె వారి పంచన చేరి వారి అడుగులకు మడుగులొత్తుతూ , తమ వృత్తికి ద్రోహం చేస్తూ ప్రవేట్ పనులు చేసుకుంటున్న ఉపాధ్యాయులు కోకొల్లలు …పాఠశాలకు రాకుండానే వచ్చినట్లు రిజిస్టర్ లో సంతకం పెట్టి జీతం మాత్రం నెలనెలా చక్కగా తీసుకుంటున్నవారు మరికొందరు …కొందరు వారి బదులు వేరేవారిని పంపిస్తున్న సంఘటనలు ఉన్నాయి ..రియల్ ఎస్టేట్ వ్యాపారం ,చిట్ ఫండ్ వ్యాపారం ఇలా ఒకటేమిటి అనేక రకాలుగా అడ్డగోలు సంపాదనలుకు అలవాటు పడ్డ ఉపాధ్యాయులుపై చర్యలు లేకపోవడం ఇందుకు కారణం ..దీంతో ప్రభుత్వ పాఠశాలలు అంటే చదువు చెప్పరని అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది …ఫలితంగా ఫీజుల భారమైన ప్రవేట్ పాఠశాల వైపు పరుగులు తీస్తున్నారు .. అయితే అందరు ఉపాధ్యాయులు ఆలా ఉన్నారా ..? అంటే కొంతమంది వల్ల మొత్తం ఉపాధ్యాయ కమ్యూనిటీకి మచ్చ వస్తుంది .
దేశం మొత్తంలో ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు బాగున్నాయని పేరు ఉంది …ప్రత్యేకంగా ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పాఠశాలలపై ద్రుష్టి సారించారు …ఆమేరకు పబ్లిక్ లో కూడా ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఏర్పడింది ..ప్రభుత్వ పాఠశాలల్లో చేరే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది . మొదట శిశోడియా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ..తర్వాత కేజ్రీవాల్ కూడా ఆశాఖ నిర్వహించారు … ప్రస్తుత సీఎం అతిశీ కూడా విద్యాశాఖ బాధ్యతలు చూశారు .. తరవాత జరిగిన పరిణామాల్లో ప్రభుత్వంలో కొంత అస్థిరత చోటు చేసుకోవడంతో పంతుళ్ళ ఇష్టారాజ్యంగా మారింది …
ఇటీవలనే ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశీ ఒక ప్రభుత్వ పాఠశాలను సామాన్యురాలుగా ఆకస్మికంగా వెళ్లి తనిఖీ చేశారు ..ప్రభుత్వ వాహనాన్ని బయటే పెట్టి తన వెంట వచ్చిన ఒక అటెండర్ ను తీసుకోని ఆమె నేరుగా ఒక తరగతి గదికి వెళ్లారు .అక్కడ ఉపాధ్యాయులు ఎవరు లేరు ..పిల్లలు ఎవరి వారి ఇష్టం వచ్చినట్లు వారు ఆడుకుంటున్నారు …ఆదృశ్యం చూసి అవాక్కు అయిన ఆమె వెంటనే ప్రిన్సిపాల్ ఎక్కడ అని అక్కడ ఉన్నవారిని అడిగారు .ముఖ్యమంత్రి వచ్చిన విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ చెమటలు కక్కుతూ పరుపరుగున వచ్చారు .. ఇక్కడ టీచర్ ఏరి ఎక్కడ ఉన్నారు ఆమె పేరు ఏమిటి అని అడిగితె నీళ్లు నములుతూ జ్యోతి మేడం ఇక్కడే ఉన్నారు ..వస్తారు అంటూ పొంతనలేని సమాధానాలు చెప్పడం ప్రారంభించారు …టీచర్ ను పిలుచుకొని వస్తానని అక్కడ నుంచి వెళ్లే ప్రయత్నం చేయగా లేదు ..లేదు ..ఇక్కడ ఉండండి అని మంత్రి గట్టిగా అన్నారు . టీచర్ ఎక్కడ ఉన్నారు అంటే బయటకు వెళ్లారు, వస్తారు అని ప్రిన్సిపాల్ నోట్లోనుంచి మాటలు వచ్చిరానట్లగా వచ్చాయి …విషయం గ్రహించిన సీఎం ప్రిన్సిపాల్ పై ప్రశ్నల వర్షం కురిపించారు …ఇదేనా మీ నిర్వాహకం ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిచ్చి పిల్లలలకు విద్యాబుద్ధులు నేర్పమంటే ఏంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు .. పాఠశాల ప్రాంగణంలో పెద్ద మైదానం ఉన్న తరగతి గదుల వద్దనే తమ వాహనాలు పార్క్ చేయడం గుర్తించిన సీఎం ప్రిన్సిపాల్ ను ప్రశ్నించారు ..దానికి సరైన సమాధానం లేదు
స్కూల్ లో మొత్తం ఎంతమంది టీచర్స్ ఉన్నారు .. ఈరోజు ఎంతమంది వచ్చారు ..అంటే దానికి ప్రిన్సిపాల్ నుంచి సరైన సమాధానంలేదు …ఒక టీచర్ ఎలాంటి సెలవు పెట్టకుండానే గత రెండు నెలలుగా స్కూల్ కు డుమ్మాకొడుతున్న విషయాన్నీ సీఎం గ్రహించారు …మరొకతను పరిస్థితి దాదాపు అదే … ఆస్కూల్ లో మొత్తం 19 మంది టీచర్స్ ఉండగా సీఎం విజిట్ రోజు కేవలం 11 మంది మాత్రమే అటెండ్ అయ్యారని తెలుసుకున్న సీఎం వెంటనే టీచర్స్ అంటెండెన్స్ రిజిస్టర్ తీసుకోని వారి గురించి పేరుపేరునా వాకబు చేశారు .వెంటనే అక్కడ నుంచే విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ కు ఫోన్ చేసి స్కూల్ కు డుమ్మాకొట్టిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ..
Teachers Dumma in Delhi School…Surprising things in CM Atishi’s surprise inspection
Teachers in government schools who were absent without permission…
Surprised Delhi CM .. CM who deposed the principal
The water-chewed principal …unmatched answers
CM Atishi inspected a government school in Delhi suddenly…
Out of 19 teachers, only 11 people attended
This is Sarkar schools…it has become a custom for the teachers who are getting salary, be it Delhi or Gully, to go to school…whoever is in power, joining their panchan and bowing at their feet, betraying their profession and doing corrupt work. But there are some who are earning well month after month…there are incidents where some are sending others instead of them..The reason for this is that there is no action against the teachers who are used to earn money in different ways like real estate business, chit fund business. .As a result they are running towards fee burdened private schools .. but are all teachers like that ..? It means that the entire teaching community is tarnished by a few people.
Public schools in Delhi are known to be good in the whole country…especially after AAP came to power, the government focused on schools…and the public also has faith in public schools…the number of children joining government schools has increased significantly. First Shishodia was the Minister of Education ..then Kejriwal also managed the department … the current CM Atishi also looked after the responsibilities of the education department .. in the later developments, there was some instability in the government and it became a kingdom of panthula …
Atishi, who was recently sworn in as the Delhi CM, went to inspect a government school as a commoner. .Shocked by the sight, she immediately asked those present where the principal was. The principal came running sweating when he heard that the chief minister had arrived.. She asked where is teacher Eri, what is her name, and Jyoti madam was still here chewing water. ..I did not try to go from there saying that I will call the teacher ..no .. stay here the minister said firmly It was as if the words of the principal did not come from the note of the principal saying where the teacher was, he went out and would come back… The CM who understood the matter showered questions on the principal. The CM questioned the principal who noticed that their vehicles were parked there..There was no correct answer
How many teachers are there in the school? How many have come today? There is no proper answer from the principal. On learning that there were many teachers, only 11 attended the day of the CM’s visit, the CM immediately called the names of those who did not take the teachers’ attendance register.
दिल्ली के स्कूल में शिक्षक दुम्मा…सीएम आतिशी के औचक निरीक्षण में हैरान करने वाली बातें
सरकारी स्कूलों में बिना अनुमति अनुपस्थित रहने वाले शिक्षक…
दिल्ली के सीएम हैरान.. प्रिंसिपल को अपदस्थ करने वाले सीएम
पानी चबाने वाले प्रिंसिपल…बेमिसाल जवाब
सीएम आतिशी ने अचानक दिल्ली के एक सरकारी स्कूल का निरीक्षण किया…
19 शिक्षकों में से केवल 11 लोग उपस्थित हुए
ये सरकार स्कूल हैं… दिल्ली हो या गली, वेतन पाने वाले शिक्षकों के लिए स्कूल जाना एक रिवाज बन गया है… जो भी सत्ता में है, उनके पंचान में शामिल होकर उनके चरणों में झुकना, अपने पेशे के साथ विश्वासघात करना और भ्रष्ट काम कर रहे हैं लेकिन कुछ ऐसे भी हैं जो महीने दर महीने अच्छी कमाई कर रहे हैं…ऐसी घटनाएं भी हैं जहां कुछ लोग अपनी जगह दूसरों को भेज रहे हैं..इसका कारण यह है कि पैसे कमाने के आदी शिक्षकों के खिलाफ कोई कार्रवाई नहीं होती है। रियल एस्टेट व्यवसाय, चिटफंड व्यवसाय जैसे विभिन्न तरीकों से। परिणामस्वरूप वे फीस के बोझ से दबे निजी स्कूलों की ओर भाग रहे हैं.. लेकिन क्या सभी शिक्षक ऐसे ही हैं..? इसका मतलब यह है कि कुछ लोगों के कारण पूरा शिक्षक समुदाय कलंकित हो गया है।
दिल्ली के पब्लिक स्कूल पूरे देश में अच्छे माने जाते हैं…खासकर AAP के सत्ता में आने के बाद सरकार ने स्कूलों पर ध्यान केंद्रित किया…और जनता का भी पब्लिक स्कूलों पर भरोसा बढ़ा…सरकारी स्कूलों में नामांकित बच्चों की संख्या स्कूलों में काफी वृद्धि हुई है। पहले शिशोदिया शिक्षा मंत्री थे..फिर केजरीवाल ने भी विभाग संभाला…मौजूदा सीएम आतिशी ने भी शिक्षा विभाग की जिम्मेदारी संभाली..बाद के घटनाक्रम में सरकार में कुछ अस्थिरता आई और यह पंथुला का साम्राज्य बन गया। ..
हाल ही में दिल्ली की सीएम पद की शपथ लेने वाली आतिशी एक आम नागरिक के तौर पर एक सरकारी स्कूल का निरीक्षण करने गईं. वहां मौजूद लोगों से उन्होंने तुरंत पूछा कि प्रिंसिपल कहां हैं मुख्यमंत्री ने पूछा कि टीचर एरी कहां हैं, उनका नाम क्या है और ज्योति मैडम अभी भी पानी चबा रही थीं.. मैंने यह कहकर वहां से जाने की कोशिश नहीं की कि मैं टीचर को बुलाऊंगा.. नहीं.. मंत्री जी यहीं रुकें. दृढ़ता से कहा. ऐसा लग रहा था जैसे प्रिंसिपल के ये शब्द प्रिंसिपल के नोट से नहीं निकले हों कि टीचर कहां हैं, वो बाहर गए हैं और वापस आएंगे…मामला समझ गए सीएम ने प्रिंसिपल से सवालों की बौछार कर दी प्रिंसिपल ने देखा कि उनके वाहन वहां खड़े थे..कोई सही उत्तर नहीं था
स्कूल में कितने शिक्षक हैं, आज कितने आये हैं, इस पर प्रिंसिपल की ओर से कोई उचित जवाब नहीं दिया गया. यह जानने पर कि सीएम के दौरे के दिन सिर्फ 11 शिक्षक आये थे, तो सीएम ने तुरंत उनके नाम बुलाये. जो शिक्षकों की उपस्थिति पंजी नहीं ले गए।