Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

వైభవంగా వురిమళ్ల ఫౌండేషన్ వార్షికోత్సవం

  • కథల, కవితల పోటీల విజేతలకు బహువుతులు అందజేత


ప్రముఖ సాహితీ సంస్థ వురిమళ్ల ఫౌండేషన్ 6వ వార్షికోత్సవం ఖమ్మంలోని మంచికంటి మీటింగ్ హాల్‌లో ఆదివారం వైభవంగా జరిగింది. ప్రతి ఏటా ఉమ్మడి ఖమ్మంలోని లబ్ధిప్రతిష్టుైలెన కవులుకు, రచయితలకు అందిస్తున్న ‘భోగోజు సముద్రమ్మం-పురుషోత్తం’ స్మారక పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ రచయిత సమ్మెట ఉమాదేవికి వార్షికోత్సవ సభలో అందచేశారు. అనంతరం జాతీయ స్థాయిలో నిర్వహించిన వురిమళ్ల శ్రీరాములు స్మారక కథల, వురిమళ్ల పద్మక స్మారక కవితల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహువుతులు అందచేసి సన్మానించారు. తొలుత వురిమళ్ల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు వురిమళ్ల సునంద అధ్యక్షతన జరిగిన సభలో కథల, కవితల సంకలనాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రముఖ రచయిత శ్రీకంఠ స్ఫూర్తి మాట్లాడుతూ ప్రతి ఏటా పోటీలు నిర్వహించి విజేతలకు బహువుతులతో పాటు వారి కథలు, కవితలన్నింటిని పుస్తకంగా మలిచి కానుకగా అందజేయడం అభినందనీయువున్నారు. ప్రతి కవి తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తే అనేక కథలు, కవితలు పుట్టుకొస్తాయున్నారు. ఈ ఏడాది అద్భుతైమెన కథలు వచ్చాయున్నారు. అన్నీ సామాజిక మార్పును కోరుకునేవే ఉన్నాయున్నారు. ప్రముఖ కవి మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ వురిమళ్ల సునంద చేస్తున్న సాహిత్య సేవను కొనియాడారు. సాహితీ కిరణం మాసపత్రిక ఎడిటర్ పొత్తూరి సుబ్బారావు మాట్లాడుతూ వురిమళ్ల సునంద తను రాయడమే కాదు అటు పిల్లలతోనూ, ఇటు వర్థమాన రచయితలతోనూ రాయిస్తుండడం అభినందనీయువున్నారు. ఈ సందర్భంగా కవిత, కథల పోటీల విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సాహితీ మాసపత్రిక ‘ప్రస్థానం’ ఎడిటర్ సత్యాజీ మాట్లాడుతూ వురిమళ్ల సునంద తన తాత వురిమళ్ల శ్రీరాములు, చెల్లెలు వురిమళ్ల పద్మజ పేరుతో పోటీలు నిర్వహించి బహువుతులు అందజేయడం అభినందనీయువున్నారు. ఖమ్మం సాహిత్యానికి పెద్ద గుమ్మవుని, ఇక్కడి సాహితీ సంస్థలు ఎనలేని సాహితీ సేవ చేస్తున్నాయని, అందులో వురిమళ్ల ఫౌండేషన్ ముందుందని కొనియాడారు. ప్రతి ఏటా ఇచ్చే భోగోజు సముద్రమ్మ-పురుషోత్తం’ స్మారక పురస్కారం ఈ ఏడాది సమ్మెట ఉమాదేవికి ఇవ్వడం సరైన నిర్ణయువున్నారు. ఈ మేరకు విజేతలను, పురస్కార గ్రహీతలను అభినందించారు. వురిమళ్ల ఫౌండేషన్ వెలువరించిన పుస్తకాన్ని అక్షరాల తోవ నిర్వాహకులు నామా పురుషోత్తం సమీక్షించారు. అనంతరం కవులను సన్మానించారు. ఈ సందర్భంగా విజేతైలెన కవులంతా తమ స్పందనను వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో వురిమళ్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుల్లో ఒకైరెన భోగోజు ఉపేందర్‌రావు, అక్షరాల తోవ నిర్వాహకులు దాసరోజు శ్రీనివాస్, రాచమళ్ల ఉపేందర్, నంది అవార్డు గ్రహీత దేవేంద్ర, ప్రముఖ కవులు కపిల రాంకుమార్, పొత్తూరి సీతారావురావు, ఇబ్రహీం నిర్గుణ్, రమణ, కోండ్రు బ్రహ్మం, కొమ్మవరపు కృష్ణయ్య, కన్నెగంటి వెంకటయ్య, ఫణిమాధవి, తాళ్లూరి రాధ, మద్దినేని జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

కథల, కవితల పోటీల విజేతల్లో సన్మాన గ్రహీతలు వీరే…

వురిమళ్ల శ్రీరాములు స్మారక కథల పోటీల్లో మొదటి బహువుతిని ఎస్‌వికె సంహితనాయుడు(హైదరాబాద్), ద్వితీయ బహువుతిని కంచర్ల శ్రీనివాస్(ఖమ్మం) అందుకున్నారు.  ప్రోత్సాహక బహువుతులను పొత్తూరి సీతారావురాజు(కాకినాడ) అందుకున్నారు. వురిమళ్ల పద్మజ స్మారక కవితల పోటీల్లో మొదటి బహువుతిని నాంపల్లి సుజాత(ైహెదరాబాద్), ద్వితీయ బహువుతిని చిందం రవేుష్(జగిత్యాల), తృతీయ బహువుతిని పొత్తూరి సీతారామారాజు(కాకినాడ) అందుకున్నారు. ప్రొత్సాహక బహువుతిని అవ్వారు శ్రీధర్‌బాబు(నెల్లూరు)అందుకున్నారు. వీరికి నగదు బహువుతులు అందచేసి సన్మానించారు.

భోగోజు సముద్రమ్మ-పురుషోత్తం స్మారక పురస్కారం గ్రహీతలు వీరే ః

ప్రతి ఏటా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాహతీ వేత్తలకు అందించే ‘భోగోజు సముద్రమ్మ-పురుషోత్తం’ స్మారక పురస్కారాన్ని 2019లో ప్రారంభించారు. తొలి ఏడాది అభినవ మొల్ల చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మకు, 2020లో పొత్తూరి వేంకటసుబ్బారావుకు, 2021లో దిలావర్‌కు, 2022లో బైరి ఇందిరకు, 2023లో తాటికొండాల నర్సింహారావుకు అందచేశారు. ఈ ఏడాది 2024 పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి సమ్మెట ఉమాదేవికి అందచేశారు. పురస్కారంతో పాటు ఆమెకు పది వేల నగదు బహువుతిని అందచేసి సన్మానించారు. 

సమీక్షల సమాహారం పుస్తకావిష్కరణ
జాతీయ స్థాయిలో వురిమళ్ల ఫౌండేషన్ నిర్వహించిన పుస్తక సమీక్షల పోటీల్లో విజేతైలెన విద్యార్థుల సమీక్షలతో కలిపి పుస్తకం వెలువురించారు. ఈ పుస్తకాన్ని వురిమళ్ల ఫౌండేషన్ 6వ వార్షికోత్సవంలో పుస్తక సమీక్షలు రాసిన విద్యార్థుల చేతనే ఆవిష్కరించారు. అనంతరం వురిమళ్ల సునంద మాట్లాడుతూ కథలు, కవితలు రాయడం సులభం, ఈ విద్యార్థులు ప్రముఖ కవుల పుస్తకాలను సమీక్ష చేసి పంపి పోటీల్లో విజేతలుగా నిలవడం అభినందనీయువున్నారు. ఈ సంద్భంగా బాలరచయితలకు సర్టిఫికెట్లు అందచేసి అభినందించారు.

Related posts

కీంకర్తవ్యం … ఖమ్మం కాంగ్రెస్ నేతల సమాలోచనలు…

Ram Narayana

ప్రభుత్వ భూములు కాపాడండి…మంత్రి తుమ్మల

Ram Narayana

ఖమ్మంజిల్లాలో మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందించిన మంత్రి పొంగులేటి …

Ram Narayana

Leave a Comment