Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఎమ్మెల్సీ ఆమెర్ అలీఖాన్ కు ఖమ్మంలో పూలవర్షం …

ఇటీవలనే తెలంగాణ శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా ఖమ్మం వచ్చిన ఆమేర్​ అలీఖాన్ కు ఘనస్వాగతం లభించింది … ఆయన ఇక్కడకు చేరుకోగానే అభిమానులు వివిధ సంఘాలవారు పూలవర్షం కురిపించారు .. బైక్ ర్యాలీ నిర్వహించాయి .ఆదివారం నగరంలో స్థానిక టీఎన్​జీఓ ఫంక్షన్​ హాల్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పులబొకేలు, షాలువాలతో ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో వీరనారిమణుల ఆశయసాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భుక్యా ఉపేంద్రాబాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడాల జాన్సీ, జిల్లా ఉపాధ్యక్షురా భుక్యా జ్యోతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకుడు బాణోత్​ భద్రునాయక్​, డాక్టర్​ కేవీ.క్రిష్ణారావు, అబ్దుల్​ రహమాన్​ తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీ డిక్లరేషన్ అమలు చేయాలని ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కు వినతి పత్రం

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ అమలు చేయాలని ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కు ఖమ్మం నగరం స్థానిక ఎన్ఎస్పి గెస్ట్ హౌస్ లో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్ జేఏసీ ఖమ్మం జిల్లా కన్వీనర్ షేక్ అబ్దుల్ రహిమాన్ , జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ సలీం పాషా , షేక్ యాకుబ్ భాయి తదితరులు పాల్గొన్నారు .

మైనారిటి గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో

ఖమ్మం నగరంలో టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ లో నూతనముగా మ్మెల్సీ గా ఎన్నికైన జనాబ్ ఆమిర్ అలీఖాన్ ఆత్మీయ సన్మాన సమావేశంలో మైనారిటి గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు . అనంతరం వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు . ప్రభుత్వము ద్వారా ఆర్.యం.పి.పి.యం.పి లకు గుర్తింపును మరియు మెడికల్ కౌన్సిలింగ్ దాడులు నిలిపివేసి , అక్రమముగా పెట్టిన కేసులను ఎత్తివేయాలి , 50 సం||ల వయస్సు దాటిన ఆర్.యం.పి.- పి.యం.పి లకు పెన్షన్ ఇప్పించుట – నిరుపేద ఆర్. యం.పి. పి.యం.పి లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేక ఇండ్ల స్థలములను ఇప్పించాలని కోరారు . కాంగ్రేస్ ప్రభుత్వ మెనిఫెస్టో ప్రకారం ఆర్.యం.పి – పి.యం. పిలకు మరల శిక్షణ కొనసాగింపు మరియు సర్టిఫికేట్స్ ఇచ్చే కార్యక్రమమును త్వరగా కొనసాగించే విధముగా ప్రభుత్వము తరపున తమరు చూడాలని అన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యస్.కె. హసన్ , జిల్లా జనరల్ సెక్రటరీ యస్.కె. జానిమియా , కోశాధికారి యస్.కె. బాబుసాహెబ్ , జిల్లా గౌరవ అధ్యక్షులు యస్.కె. హసన్ , సంఘం వ్యవస్థాపకులు యస్.కె. నజీరుద్దీన్ , జిల్లా ఉపాధ్యక్షులు షేక్ ఖాసీం , షేక్ చంద్ పాషా , జిల్లా జాయింట్ సెక్రటరీ షేక్ పాషా , జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ మహ్మద్ సాహెబ్ , ప్రచార కార్యదర్శులు షేక్ అమీర్ , షేక్ జాని (శ్రీరాంగిరి) , కార్యదర్శులు షేక్ అబ్దల్ , షేక్ మస్తాన్ పాషా , జిల్లా ఎగ్జిక్యూటీవ్ సభ్యులు షేక్ మన్సూర్ అలి , షేక్ షాజహాన్ , షేక్ నబి , షేక్ అలీ , షేక్ అహ్మద్ పాషా , షేక్ వలి , షేక్ మహిమూద్ షేక్ బాజీ , షేక్ రబ్బాని , షేక్ నబీ , షేక్ ఇషాక్ తదితరులు పాల్గొన్నారు .

తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేసి మొట్ట మొదటిసారిగా ఖమ్మం కు వచ్చిన ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కు స్వాగతం పలుకుతూ బైక్ ర్యాలీ ని నిర్వహించారు . తోలుతూ అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ కార్యక్రమంలో సంచార ముస్లిం రాష్ట్ర అధ్యక్షులు సైదా ఖాన్ , జిల్లా అధ్యక్షులు ముస్తఫా జిల్లా , ఉపాధ్యక్షులు ఇమామ్ , జిల్లా ఉపాధ్యక్షులు జాంగిర్ , జిల్లా ఉపాధ్యక్షులు నాగుల మీర , ముదిగొండ మండల అధ్యక్షులు రహమాన్ , వైరా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కరీం తదితరులు పాల్గొన్నారు . తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు …

Related posts

ల్యాంప్ కొందామని వెళ్లి.. తెగ షాపింగ్ చేసిన యువతి.. అర చేతిలో ఆరు అడుగుల రశీదు!

Ram Narayana

హైదరాబాద్ పోలీసులపై మండిపడ్డ డీకే అరుణ

Ram Narayana

పెద్ద శబ్దంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన…కుట్రకోణం ఉందనే దిశగా పోలీసులకు ఫిర్యాదు!

Ram Narayana

Leave a Comment